Konathala Ramakrishna : సొంత‌గూటికి మాజీ మంత్రి కొణ‌తాల రామ‌కృష్ణ‌..?

మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు విశాఖపట్నం జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షుడు గొంప

  • Written By:
  • Publish Date - January 3, 2024 / 11:38 PM IST

మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు విశాఖపట్నం జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షుడు గొంప గోవిందరాజు వెల్లడించారు. వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి హయాంలో వాణిజ్య పన్నుల శాఖ మంత్రిగా కొణతాల రామ‌కృష్ణ ప‌ని చేశారు. వైజాగ్ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు. రాజశేఖర రెడ్డి మ‌ర‌ణానంత‌రం.. వైసీపీలోకి వెళ్లారు. అయితే ఆయన వైసీపీకి రాజీనామా చేయడం సంచలనం సృష్టించింది. అప్పటి నుంచి కొణతాల క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం తర్వాత కాంగ్రెస్ మాజీ నేత కె.వి.పి. రామచంద్రరావు ఒకప్పుడు కాంగ్రెస్ రాజకీయాల్లో యాక్టివ్‌గా ఉన్న వారితో టచ్‌లో ఉంటున్నారు. కొణతాల రామ‌కృష్ణ‌.. కేవీపీ రామచంద్రరావుకు అత్యంత స‌న్నిహితుడు. ఈ నేప‌థ్యంలో కొణ‌తాల‌ను కాంగ్రెస్‌లో చేరాల‌ని కేవీపీ ఆహ్వానించిన‌ట్లు స‌మాచారం. తాజాగా వైజాగ్ డీసీసీ అధ్యక్షుడు గోవింద‌రాజు.. కొణతాల రామకృష్ణ‌ కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు ప్రకటించారు. కాగా, గాజువాక సిట్టింగ్ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి కూడా కొణతాల రామకృష్ణను కలిశారు. దీంతో సిట్టింగ్‌ ఎమ్మెల్యే కూడా కాంగ్రెస్‌లోకి వెళుతున్నారనే ఊహాగానాలు వ‌స్తున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో గాజువాక ఎమ్మెల్యే తిప్ప‌ల నాగిరెడ్డికి వైసీపీ అధిష్టానం టికెట్ నిరాక‌రించింది. దీంతో తిప్పల కుటుంబం మొత్తం కాంగ్రెస్‌లో చేరనున్నారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

Also Read:  TDP : విజ‌య‌న‌గ‌రం జిల్ల‌లో నారా భువ‌నేశ్వ‌రి ప‌ర్య‌ట‌న‌.. కార్య‌క‌ర్త‌ల కుటుంబాట‌కు ప‌రామ‌ర్శ‌