Janasena : అనకాపల్లిలో ‘గ్లాస్’ ప్రచారం.. ‘టీ’ తాగండి..’గ్లాస్’ కి ఓటెయ్యండి

ఎమ్మెల్యే అభ్యర్థి కొణతల రామకృష్ణను గెలిపించాలని టీ తాగండి..గాజు గ్లాస్ కి ఓటెయ్యండి అంటూ ప్రచారం చేస్తున్నారు

  • Written By:
  • Publish Date - March 16, 2024 / 03:11 PM IST

మరికాసేపట్లో ఎన్నికల నోటిఫికేషన్ (Election Notification 2024) రాబోతుంది..ఏపీతో పాటు పలు రాష్ట్రాల్లో ఈరోజు నుండి ఎన్నికల కోడ్ అమల్లోకి రాబోతుంది. నోటిఫికేషన్ వచ్చిదంటే ఇక నేతలు ఇంటింటి దారి పట్టాల్సిందే. ఓటర్లను ప్రసన్నం చేసుకుంటూ ఓటు అడగాల్సిందే. ప్రస్తుతం ఏపీ లో ఈసారి ఎన్నికల ఫైట్ మాములుగా ఉండబోతలేదు. బిజెపి-టిడిపి-జనసేన ముగ్గురు ఓ వైపైతే..కాంగ్రెస్ , మిత్రపక్షాలు ఓ వైపు..ఇక అవతల సింహం సింగిల్ గా వస్తది అన్నట్లు జగన్ ఒంటరిగా పోటీ చేయబోతున్నారు. కొద్దీ సేపటి క్రితం 175 అసెంబ్లీ స్థానాలతో పాటు 24 లోక్ సభ అభ్యర్థులను ప్రకటించి ఇక చూసుకుందాం అన్నట్లు సవాల్ విసిరారు.

We’re now on WhatsApp. Click to Join.

ఇదిలా ఉంటె జనసేన (Janasena) పార్టీ 21 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తుండగా..ఆ 21 స్థానాలు గెలిచి సత్తా చాటాలని చూస్తుంది. ఈ క్రమంలో ఖరారైన అభ్యర్థులు తమ ప్రచారాన్ని మొదలుపెట్టారు. అనకాపల్లి నియోజకవర్గం (Anakapalli Constituency)లో వినూత్న ప్రచారానికి తెరలేపింది. ఎమ్మెల్యే అభ్యర్థి కొణతల రామకృష్ణ (Konathala Ramakrishna)ను గెలిపించాలని టీ తాగండి..గాజు గ్లాస్ కి ఓటెయ్యండి అంటూ ప్రచారం చేస్తున్నారు. అనకాపల్లి నెహ్రూ చౌక్ జంక్షన్ లో ప్రజలకు టీ అందిస్తూ గాజు గ్లాస్ కి ఓటేయాలని అభ్యర్థించారు. ప్రతి ఒక్కరికి గుర్తుండిపోయే విధంగా గాజు గ్లాస్ విశిష్టతను వివరిస్తున్నారు. గాజు గ్లాస్ ను ప్రజల్లోకి తీసుకెళ్లే ఉద్దేశంతోనే ఈ వినూత్న ప్రచారానికి తెరలేపామని జనసైనికులు వివరించారు. మరి గ్లాస్ ను గుర్తుపెట్టుకుంటారో..ఎండ బాగుందని ఫ్యాన్ ను గుర్తు చేసుకొని గుద్దేస్తారో చూడాలి.

Read Also : 100 Days Of Congress Ruling : 100 రోజుల్లో సరికొత్త చరిత్ర సృష్టించాం – సీఎం రేవంత్ రెడ్డి