Site icon HashtagU Telugu

Konaseema Issue: అష్టదిగ్భంధంలో అమలాపురం…ఇంటర్నెట్ సేవలు బంద్…!!

Konaseema violence

Konaseema violence

వాట్సాప్ మెసేజ్ లు కొంపముంచ్చాయన్న అనుమానంతో అమలాపురంలో ఇంటర్నెట్ సేవలు నిలిపివేయాలని నిర్ణయం తీసుకున్నారు పోలీసులు. అన్ని నెట్ వర్స్ లకు సంబంధించిన ఇంటర్నెట్ సేవలను నిలిపివేస్తున్నట్లు పోలీసులు ప్రకటించారు. కోనసీమ జిల్లా పేరు మార్పు వ్యవహారం చిచ్చుపెట్టిన సంగతి తెలిసిందే. కానీ…ఇప్పుడు పరిస్థితి అదుపులోనే ఉన్నా..మళ్లీ ఛలో రావులపాలెం పిలుపుతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. నిన్న జరిగిన ఘటనలు మళ్లీ జరగకుండాఉండేందుకు ఇంటర్నెట్ సేవలు నిలిపివేయాలని అన్ని నెట్ వర్క్ లను ఆదేశించారు పోలీసులు. పలు ప్రాంతాల నుంచి అమలాపురానికి వచ్చే ఆర్టీసీ బస్సులు నిలిపివేశారు. కాకినాడు, రాజమండ్రి నుంచి కోనసీమకు బస్సు సర్వీసులు రద్దు చేసింది ఏపీఎస్ ఆర్టీసీ.

అటు కోనసీమ జిల్లాల్లో పోలీసులు భారీగా మోహరించాు. అమలాపురం అష్టదిగ్భందంలోకి వెళ్లింది. పోలీస్ పికెట్లు, భారీ గస్తీ ఏర్పాటు చేశారు. అక్కడే మకాం వేసారు. పరిస్థితులు ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. ఇవాళ రెండు వర్గాలు ఆందోళనకు పిలుపునివ్వడంతో…ఎలాంటి ఉద్రిక్త పరిస్ధితులు నెలకొనకుండా…ఏలూరు డీఐజీ పాలరాజు అప్రమత్తమయ్యారు. బయటివారుఅమలాపురంలోకి రాకుండా ఆంక్షలు విధించారు. ఎక్కడిక్కడ నిఘాపెట్టారు. అమలాపురంలో 144 సెక్షన్ విధించారు. అమలాపురం పూర్తిగా పోలీసుల వలయంలోకి వెళ్లింది. ఇవాళ ఛలో రావులపాలెంకు కోనసీమ జిల్లా సాధన సమితి పిలుపునిచ్చింది.దీంతో పోలీసులు భారీగా మోహరించారు.