AP Govt: అందరూ డిమాండ్ చేస్తేనే…కోనసీమ జిల్లా మార్పుకు సిద్ధం అయ్యాం-సజ్జల..!!

అమ‌లాపురంలో జ‌రుగుతున్న తీవ్ర ఉద్రిక్తతలపై ఏపీ ప్ర‌భుత్వ స‌ల‌హాదారు స‌జ్జ‌ల రామ‌కృష్ణా రెడ్డి స్పందించారు.

  • Written By:
  • Updated On - May 25, 2022 / 09:23 AM IST

అమ‌లాపురంలో జ‌రుగుతున్న తీవ్ర ఉద్రిక్తతలపై ఏపీ ప్ర‌భుత్వ స‌ల‌హాదారు స‌జ్జ‌ల రామ‌కృష్ణా రెడ్డి స్పందించారు. కోన‌సీమ జిల్లాకు డాక్ట‌ర్ బీఆర్ అంబేద్క‌ర్ పేరును పెట్టాల‌ని అన్నిపార్టీలు ప్రతిపాదించాయి.. కాబ‌ట్టే, పెట్టామ‌ని ఆయన స్ప‌ష్టం చేశారు. అప్ప‌టిక‌ప్పుడు పెట్టిన పేరు కాద‌న్నారు. ఇలా అంబేద్క‌ర్ పేరు పెట్టాల‌ని డిమాండ్లు వ‌చ్చాయి కాబ‌ట్టే, పేరు మార్చాల‌ని నిర్ణ‌యించామ‌ని తెలిపారు. అంబేద్క‌ర్ పేరును వ్య‌తిరేకిస్తూ చేస్తున్న ఆందోళ‌న‌లు నీటిబుడ‌గ లాంటివ‌న్నారు. అతి త్వ‌ర‌లోఏ స‌మ‌సిపోతాయని తెలిపారు.

ఉద‌యం లేచిన మొద‌లు అంద‌రూ రాజ్యాంగాన్ని ఫాలో అవుతారని, రాజ్యాంగం అంటేనే అంబేద్క‌ర్ గుర్తుకొస్తార‌ని సజ్జల అన్నారు. అంబేద్క‌ర్ లాంటి గొప్ప వ్య‌క్తికి కులం అంట‌గ‌ట్ట‌డం త‌ప్ప‌ని ఆయన స్ప‌ష్టం చేశారు. కోన‌సీమ జిల్లా పేరు మార్పు కుద‌ర‌ద‌ని ప‌రోక్షంగా పేర్కొన్నారు సజ్జల. అయితే అంద‌రూ సంయ‌మ‌నం పాటించాల‌న్నారు.

ఆందోళ‌న చేస్తున్న గ్రూపుల‌తో తాము క‌చ్చితంగా సంప్ర‌దింపులు జ‌రుపుతామ‌ని స‌జ్జ‌ల ప్ర‌క‌టించారు. అస‌లు వారికి ఉన్న అభ్యంత‌రాలేమిటో అడిగి తెలుసుకుంటామనితెలిపారు. పేరు మార్పు వెనుక ఉన్న హేతుబ‌ద్ధ‌త‌ను వివ‌రిస్తామ‌న్నారు. అంబేద్క‌ర్ జిల్లాగా పేరు మార్చాల‌న్న‌ది ఇప్ప‌టికిప్పుడు వ‌చ్చిన డిమాండ్ కాద‌న్నారు. జిల్లాల పున‌ర్విభ‌జ‌న నుంచే ఉంద‌ని ఆయన గుర్తు చేశారు.

రాజ‌కీయంగా, ప్ర‌జా సంఘాల నుంచి కూడా కోన‌సీమ‌కు అంబేద్క‌ర్ పేరు పెట్టాల‌న్న డిమాండ్ వ‌చ్చింద‌ని వివ‌రించారు. కేవ‌లం ద‌ళిత సంఘాల నుంచే ఈ డిమాండ్ రాలేద‌న్నారు, అన్ని స‌మాజాల నుంచి ఈ డిమాండ్ వ‌చ్చింద‌ని తెలిపారు .ఈ స‌మ‌స్య ప‌రిష్కారం కాని స‌మ‌స్య కాద‌ని, క‌చ్చితంగా ప‌రిష్కారం అవుతుంద‌ని ఆశాభావం వ్య‌క్తం చేశారు సజ్జల.