ఇప్పుడు ఎక్కడ చూడు..ఒకే ఒక దాని గురించి మాట్లాడుకుంటున్నారు..అదే అయోధ్య రామ మందిరం (Ayodhya Rama Mandir) గురించి. అయోధ్యలో ఏర్పాటు చేసిన శ్రీరామ ఆలయం గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఎన్నో సంవత్సరాల హిందువుల కల…అయోధ్య శ్రీరామ ఆలయం. ముస్లిం, హిందువుల మధ్య పెద్ద వివాదంగా మారిన అయోధ్య శ్రీరామ ఆలయం… బీజేపీ ప్రభుత్వంలో ఓ కొలిక్కి వచ్చింది. అయోధ్య శ్రీరామ ఆలయం విషయంలో కేంద్రంలోని మోడీ ప్రభుత్వం.. ఎంతో కష్టపడిందని చెప్పవచ్చు.
ఈ నెల 22 న అయోధ్య లో రామమందిరం అట్టహాసంగా కేంద్రం ప్రారభించబోతుంది. ఈ తరుణంలో దేశ వ్యాప్తంగా ఈ వేడుకను చూసేందుకు సిద్ధం అవుతున్నారు. ఈ అయోధ్య రామమందిరం లో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఆలయంలో ఉండే చిన్న అలంకరణ దగ్గరి నుండి ప్రతి ఒకటి దేశంలోని పలు రాష్ట్రాల నుండి వచ్చినవే ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల నుండి కూడా అనేక వస్తువులు వెళ్లగా..తాజాగా నేడు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట నుంచి రామ మందిర ప్రారంభోత్సవానికి కల్యాణ కొబ్బరి బోండాలు చేరుకున్నాయి.
అయోధ్యలోని సీతమ్మ ఆశ్రమం కోరిక మేరకు శంకు చక్ర నామ కొబ్బరి బోండాలను భక్తిశ్రద్ధలతో తయారుచేసి.. రాముడికి కానుకగా పంపారు మండపేటకు చెందిన రామారెడ్డి, మహాలక్ష్మి దంపతులు. అయోధ్య రాములవారి విగ్రహప్రతిష్టాపన కార్యక్రమానికి శంకు చక్ర నామ కొబ్బరి బోండాలు తయారుచేసి పంపడం తమ పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నరామని వారు తమ సంతోషాన్ని వ్యక్తం చేయగా.. ఈ రోజు ఆ కొబ్బరి బోండాలు అయోధ్య చేరుకోనున్నాయి. అక్కడ ఉత్సవ నిర్వహణ కమిటీకి ఈ బోండాలు సమర్పించనున్నారు మండపేట వాసి.. అయోధ్య రామమందిరంలో శ్రీసీతారాముల కళ్యాణ వేడుకలో మన మండపేటకు చెందిన కళ్యాణ కొబ్బరి బోండాలను వినియోగించనున్నారు.
Read Also :