వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ (Jagan)..మళ్లీ మీడియా ముందు పదే పదే కనిపిస్తూ తన పరువు తానే తీసుకుంటున్నాడు. ఎన్నికల్లో ప్రజలతో పాటు సొంత పార్టీ నేతలు ఇచ్చిన షాక్ నుండే ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న జగన్..తాను చేసిన తప్పులు మరచిపోయి..మంచి చేస్తున్న ప్రభుత్వం పై విమర్శలు చేస్తూ అందరి చేత ఛీ అనిపించుకుంటున్నాడు.
తాజాగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి..రాష్ట్రంలో ప్రజారోగ్య వ్యవస్థ కుప్పకూలిపోయిందనీ , విజయనగరం జిల్లా గుర్ల మండలంలో ప్రబలిన అతిసార ఘటనలే ప్రత్యక్ష ఉదాహరణ అని , 11 మంది చనిపోయినా, వందల సంఖ్యలో బాధితులున్నా చంద్రబాబు ప్రభుత్వం నిద్ర వీడడంలేదని , సమీపంలోనే ఉన్న విజయనగరం, విశాఖపట్నంల్లో మంచి ఆస్పత్రులు ఉన్నా స్థానిక పాఠశాలలోని బెంచీలమీద చికిత్స అందించడం దారుణం అని పెద్ద పెద్ద మాటలే అన్నారు. అలాగే మద్యం పాలసీ , ఇసుక పాలసీ మీద కూడా పలు వ్యాఖ్యలు చేసారు.
ఈ వ్యాఖ్యలపై మంత్రి కొల్లు రవీంద్ర (Kollu Ravindra) ఘాటుగా రియాక్ట్ అయ్యారు. జగన్ హయాంలో కల్తీ మద్యం వల్ల 50 లక్షల మంది లివర్, కిడ్నీ సమస్యలకు గురయ్యారని, అలాగే ఎక్సైజ్ శాఖను నిర్వీర్యం చేశారని, సెబ్ పేరుతో అక్రమ మద్యం వ్యాపారానికి బాటలు వేశారని అవన్నీ మరచిపోయి ఇప్పుడు నీతి బోధనలు చేస్తున్నారని రవీంద్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. వ్యవస్థలను దారుణంగా దెబ్బతీసి ఇప్పుడు మద్యం టెండర్లు, ఇసుక రవాణాలో అక్రమాలు జరుగుతున్నాయని నీతులు చెబుతున్నారు… సిగ్గుండాలి అంటూ కొల్లు రవీంద్ర మండిపడ్డారు. తన ఐదేళ్ల పాలనపై జగన్ చర్చకు రాగలరా? అని సవాల్ విసిరారు. ఆదాయం పోయిందన్న అక్కసుతో జగన్ దిక్కుమాలిన వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు.
Read Also : Kadapa : ఇంటర్ విద్యార్థినిపై ప్రేమోన్మాది పెట్రోల్ దాడి