Site icon HashtagU Telugu

Kollu Ravindra : పేర్ని నాని కొడుకుని ప్రమోట్ చేయడానికే ఈ సభ.. కొల్లు రవీంద్ర కామెంట్స్..

Kollu Ravindra comments on Perni Nani

Kollu Ravindra comments on Perni Nani

నేడు బందర్ పోర్ట్(Port) శంకుస్థాపన కార్యక్రమం అనంతరం మచిలీపట్నం(Machilipatnam)లో భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభలో జగన్(Jagan) తో పాటు మచిలీపట్టణం ఎమ్మెల్యే పేర్ని నాని(Perni Nani) కూడా పాల్గొన్నారు. పేర్ని నాని మాట్లాడుతూ.. సీఎం జగన్ తో వేదిక పంచుకోవడం ఇదే చివరి సారి కావొచ్చు అంటూ, తాను రాష్ట్ర రాజకీయాలకు గుడ్ బాయ్ చెప్తున్నట్టు ప్రకటించారు. దీంతో పేర్ని నాని నిర్ణయం ఏపీ రాజకీయాల్లో చర్చగా మారింది.

పేర్ని నాని చేసిన ఈ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో పలు రకాలుగా వాదనలు వినిపిస్తున్నాయి. తన కొడుకు కోసమే పేర్ని నాని రిటైర్మెంట్ ప్రకటించాడంటూ, త్వరలోనే తన కొడుకును రాజకీయాల్లోకి దించేందుకు పేర్ని స్కెచ్ వేశాడని, సీఎం జగన్ కూడా టికెట్ కన్ఫర్మ్ చేశాడని, అందుకే పేర్ని నాని ఇలా మాట్లాడాడని అంటున్నారు. అయితే పేర్ని నేని చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి, మచిలీపట్టణం మాజీ ఎమ్మెల్యే కొల్లు రవీంద్ర కామెంట్స్ చేశారు.

కొల్లు రవీంద్ర మీడియాతో మాట్లాడుతూ.. ఈరోజు బందర్ లో జరిగిన ముఖ్యమంత్రి సభ పేర్ని నాని వీడ్కోలు సభ. పేర్ని నాని కుమారుడిని ప్రమోట్ చేసుకునేందుకే ఈ సభ నిర్వహించారు. రెడ్డి వచ్చే మొదలాయేలా బందరు పోర్టుని మళ్ళీ శంకుస్థాపన చేశారు. పేర్ని నాని ఆధ్వర్యంలోనే మూడుసార్లు శంకుస్థాపన చేశారు. గతంలో పోర్టు నిర్మాణం పూర్తి చేయలేకపోతే మోకాళ్ల దండేసుకుని రాజకీయాల నుంచి తప్పుకుంటానని నాని ప్రకటించారు. టిడిపి హయాంలో పోర్టు నిర్మిస్తుంటే పేర్ని నాని 22 గ్రామాల ప్రజలను రెచ్చగొట్టారు. నాలుగు సంవత్సరాలు ఖాళీగా ఉండి ఆరు నెలల ముందు శంకుస్థాపన డ్రామా మొదలెట్టారు. బందరు పోర్టు కాకుండా ఫిషింగ్ హార్బర్ లాగా చేయాలని చేస్తున్నారు అని వ్యాఖ్యానించారు.

 

Also Read : Political port : బంద‌ర్ పోర్ట్ కు అమ‌రావ‌తిని ముడేసిన జ‌గ‌న్‌