Site icon HashtagU Telugu

Fake currency : మ‌రో న‌కిలీ క‌రెన్సీ ముఠా రాకెట్‌ని ఛేదించిన కోల్‌క‌తా పోలీసులు

Crime

Crime

కోల్‌కతా పోలీస్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ బృందం హౌరా బ్రిడ్జి సమీపంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న మ‌రో నకిలీ కరెన్సీ రాకెట్‌ను ఛేదించింది. వారం రోజుల వ్య‌వ‌ధిలో రెండో ముఠాను కోల్‌క‌తా పోలీసులు ప‌ట్టుకున్నారు. ఈ కేసులో సెలీమ్ సేఖ్ ​​అనే వ్యక్తిని అరెస్టు చేశారు నిందితుడి నుంచి రూ.43 వేల విలువైన నకిలీ నోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కోల్‌కతా నుండి మాల్డా జిల్లాకు చెందిన నకిలీ భారతీయ కరెన్సీ రాకెట్‌ను పట్టుకోవడంలో STF బృందం విజయం సాధించిందని నార్త్ పోర్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రవీంద్ర సేతు తెలిపారు. సోదాల సమయంలో నిందితుల వద్ద నుండి రూ. 500 నోట్లు మొత్తం 86 ఉన్న‌ట్లు పోలీసులు తెలిపారు. నిందితుల‌పై ఐపీసీ 120B 489 సెక్షన్ల కింది కేసు న‌మోదు చేశారు. కస్టడీలో వెల్లడించిన వాంగ్మూలాలు ఇచ్చిన రకీముల్‌ స్క్‌ని అరెస్టు చేసిన తర్వాత సోదాలు ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు. జనవరి 7న టాప్‌సియాలో నకిలీ కరెన్సీ రాకెట్‌కు సంబంధించి రకీముల్‌ని అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి రూ. 1,50,000 న‌కిలీ క‌రెన్సీ నోట్ల‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.