Site icon HashtagU Telugu

Kodi Kathi Srinu : టీడీపీలోకి కోడికత్తి శ్రీను కుటుంబ సభ్యులు

Kodikathisrinu

Kodikathisrinu

కోడికత్తి శ్రీను (Kodi Kathi Srinu ) కుటుంబ సభ్యులు టీడీపీలో చేరారు. ముమ్మిడివరం అసెంబ్లీ కూటమి అభ్యర్థి బుచ్చిబాబు సమక్షంలో శ్రీను తండ్రి జనిపల్లి తాతారావు, తల్లి సావిత్రి, అన్నయ్య సుబ్బరాజు, చిన్నాన్న వెంకటేశ్వరావు టీడీపీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా శ్రీను అన్న సుబ్బరాజు మాట్లాడుతూ.. చేయని నేరానికి తన తమ్ముడు ఆరేళ్ల జైలు జీవితం గడిపాడని ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ వల్లే శ్రీను బయటకు వచ్చాడన్నారు.

We’re now on WhatsApp. Click to Join.

ఇక శ్రీను మాట్లాడుతూ.. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేయాలని అనుకున్నాను.. కానీ, పరిస్థితులు అనుకూలించక టీడీపీలో చేరానన్నారు. జగన్‌ సీఎం కావడం కోసం చేసిన ప్రయత్నం కారణంగా తాను ఐదేళ్లు జైల్లో మగ్గానని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు అన్ని పార్టీల మద్దతు లభించినా.. వైసీపీ నేతలు మాత్రం పట్టించుకోలేదన్నారు. ఎస్సీ సంఘాలు, ప్రతిపక్షాల కారణంగానే తాను బతికి ఉన్నానన్నారు. తన విడుదలకు సహకరించిన అన్ని పార్టీలకు ధన్యవాదాలు తెలిపారు.

Read Also : Aadhaar As Date Of Birth Proof: ఇక నుండి ఆధార్.. డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్, ఉత్త‌ర్వులు జారీ..!