Kodi Kathi Sreenu: సీజేఐకి కోడికత్తి శ్రీను లేఖ

గత ఎన్నికల ముందు వైఎస్ జగన్ పై ఓ యువకుడు కత్తి(కోడి కత్తి)తో దాడి చేసిన విషయం తెలిసిందే. అప్పట్లో తెలుగు రాష్ట్రాల్లో ఈ దాడి సంచలనం రేపింది.

Kodi Kathi Sreenu: గత ఎన్నికలకు ముందు వైఎస్ జగన్ పై జరిగిన దాడి తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. ఆ ఘటనలో జగన్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. దాడి చేసిన యువకుడి పేరు శ్రీనివాస్ గా గుర్తించారు పోలీసులు. ప్రస్తుతం శ్రీనివాస్ జైలు శిక్ష అనుభవిస్తున్నాడు.

కోడి కత్తి దాడిలో నిందితుడు శ్రీనివాస్ కేసుపై ఈ రోజు విజయవాడలోని ఎన్ఐఏ కోర్టులో విచారణ జరిగింది. ఈ విచారణకు నిందితుడు శ్రీనివాస్ తో పాటు, ఇరు పక్షాల న్యాయవాదులు హాజరయ్యారు. ఇదంతా బాగానే ఉన్నప్పటికీ నిందితుడు శ్రీనివాస్ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఓ లేఖ రాసినట్టు బయటపడింది. తాను 1610 రోజులుగా జైలు శిక్ష అనుభవిస్తున్నానని, బెయిల్ కూడా ఇవ్వడం లేదని లేఖలో పేర్కొన్నాడు. ప్రస్తుతం శ్రీనివాస్ రాసిన లేఖ హాట్ టాపిక్ గా మారింది.

నిందితుడు శ్రీనివాస్ రాసిన లేఖలో సారాంశం ఏంటంటే… బెయిల్ లేకుండా 16,10 రోజులుగా జైలులోనే ఉంటున్నానని వాపోయాడు. బెయిల్ మంజూరు చేయాల్సిందిగా పలు మార్లు సుప్రీం కోర్టుకు లేఖ రాశానని తెలిపాడు. అయితే స్పందన లేకపోవడంతో మీకు(సుప్రీం ప్రధాన న్యాయమూర్తి) లేఖ రాశానని శ్రీనివాస్ లేఖలో పేర్కొన్నాడు. అయితే తనపై నమోదైన కేసును జిల్లా న్యాయ స్థానంలో విచారించి న్యాయం చేయాల్సిందిగా కోరాడు.

Read More: TDP Twist : ముగ్గురి ముచ్చ‌ట‌! విజ‌య‌వాడ ఎంపీగా బాల‌య్య‌?