Site icon HashtagU Telugu

Kodali Nani : ఎట్టకేలకు మీడియా ముందుకు వచ్చిన కొడాలి నాని

Kodali Nani Tirumala Laddu

Kodali Nani Tirumala Laddu

Kodali Nani about Tirumala Laddu Issue : గుడివాడ మాజీ వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని (Kodali Nani) ..చాల నెలల తర్వాత మీడియా ముందుకు వచ్చారు. అప్పుడెప్పుడో ఎన్నికల సమయంలో..ఆ తర్వాత ఒకటి , రెండు సార్లు మీడియా ముందు కనిపించిన ఆయన..ఆ తర్వాత కనిపించకుండా పోయాడు. నాని అసలు రాష్ట్రంలో ఉన్నాడా..? లేక విదేశాలకు వెళ్లాడా…? అని అంత మాట్లాడుకున్నారు. అయినప్పటికీ నాని దర్శనం మాత్రం జరగలేదు. ప్రస్తుతం గత వారం రోజులుగా తిరుమల లడ్డు (Tirumala Laddu) వ్యవహారం హాట్ టాపిక్ గా మారడం తో నాని మీడియా ముందుకు వచ్చాడు. భారీ గడ్డం తో కనిపించేసరికి అంత షాక్ అయ్యారు.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో శాంతి భద్రతల నిర్వహణలో ప్రభుత్వం విఫలమైందని, చంద్రబాబు అసలు వెంకటేశ్వర భక్తుడు కాదని ఆరోపించారు. టీడీపీ నాయకులు బరితెగించి వైసీపీ కార్యకర్తలపై దాడి చేస్తున్నారని తనదైన శైలిలో మండిపడ్డారు. తిరుమల లడ్డూ పవిత్రతను చంద్రబాబు అపవిత్రం చేశారని, గత కొన్ని రోజులుగా తిరుమలతో పాటు రాష్ట్ర ప్రతిష్ఠను మంటగలిపే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి చర్యలతో రాజకీయ లబ్ధి పొందాలనుకుంటే శ్రీవారు క్షమించరని పేర్కొన్నారు. కల్తీ నెయ్యిని ఎప్పుడూ తిరుమలలో వాడలేదన్నారు. 2019కి ముందు చంద్రబాబు అధికారంలో ఉన్న సమయంలో 15 సార్లు నెయ్యిలో క్వాలిటీ లేదని ట్యాంకర్లు వెనక్కి పంపడం జరిగింది. కానీ 2019 తర్వాత వైసీపీ(YCP) అధికారంలోకి వచ్చిన తర్వాత.. నెయ్యి క్వాలిటీ లేదని 18 సార్లు ట్యాంకర్లను వెనక్కి పంపడం జరిగిందని గుర్తు చేశారు. జులై 17న ఒక ట్యాంకర్‌లో నెయ్యి క్వాలిటీ లేదని వెనక్కి పంపడం జరిగింది. ఆ నెయ్యిని లడ్డూ తయారీలో వాడలేదని నాని పేర్కొన్నారు.

Read Also : Jammu and Kashmir : జమ్మూ కశ్మీర్‌లో ప్రశాంతంగా ముగిసిన రెండో దశ పోలింగ్‌..