Kodali Nani : టీడీపీ కి కొడాలి నాని సవాల్..నిరూపిస్తే రాజకీయాలు వదిలేస్తా ..

గుడివాడ గురించి చంద్రబాబు, టీడీపీ పకోడీగాళ్లు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు

Published By: HashtagU Telugu Desk
Arrest Warrant To Kodali Nani

Arrest Warrant To Kodali Nani

మొన్నటి వరకు సైలెంట్ గా ఉన్న కొడాలి నాని (Kodali Nani) మళ్లీ తన నోటికి పనిచెపుతున్నారు. చంద్రబాబు అరెస్ట్ (Chandrababu Arrest) తర్వాత రాష్ట్రంలో టీడీపీ (TDP) సైలెంట్ అయ్యింది. బాబు విడుదల కోసం ధర్నాలు , నిరసనలు తెలుపుతూ దాదాపు 52 రోజుల వరకు బాబు కోసం పోరాటం చేసారు. ఇక ఇప్పుడు బాబు బయటకు రావడం..జనసేన తో కలిసి కార్యాచరణ మొదలుపెట్టడం తో..మళ్లీ వైసీపీ నేతలు బాబు ను టార్గెట్ చేయడం మొదలుపెట్టారు.

తాజాగా నేడు మాజీ మంత్రి , గుడివాడ వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని..టీడీపీ కి సవాల్ విసిరారు. గుడివాడ గురించి చంద్రబాబు, టీడీపీ పకోడీగాళ్లు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. గుడివాడ (Gudivada) నియోజకవర్గ ప్రజల త్రాగునీటి అవసరాలు, నివాస స్థలాల కోసం టీడీపీ హయంలో ఒక్క ఎకరా సేకరించినట్లు నిరూపిస్తే ఎన్నికల్లో పోటీ చేయకుండా, రాజకీయాలనుండి తప్పుకుంటానని సవాల్ చేసారు. సోమవారం కృష్ణా జిల్లా గుడివాడలో ముస్లిం సంచారజాతుల బీసీ(ఈ) కుల ధ్రువీకరణ పత్రాల పంపిణీ కార్యక్రమంలో కొడాలి నాని పాల్గొని.. ముస్లిం సోదరులకు ధ్రువీకరణ పత్రాలు పంపిణీ చేశారు.

We’re now on WhatsApp. Click to Join.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ముఖ్యమంత్రులుగా వైయస్‌ రాజశేఖరరెడ్డి, వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి గుడివాడ ప్రజల అవసరాల కోసం 625 ఎకరాల భూములు కొన్నారని వెల్లడించారు. గుడివాడలో తన బంధువులు ఉన్నారని చెప్పుకునే చంద్రబాబు 14 ఏళ్లు సీఎంగా ఉండి ఏం చేశారని ప్రశ్నించారు. ప్రజలను ఆత్మబంధువులుగా చూసేజగన్.. గుడివాడ అభివృద్ధి, ప్రజా సంక్షేమానికి రూ.4 వేల కోట్లు ఖర్చు చేశారని తెలిపారు. రామాయణంలో పిడకల వేటలా పనికిమాలిన టీడీపీ, జనసేన నేతలు రోడ్లపైకి వస్తున్నారు. ధనికుల కార్లు బ్రేకులు వేయకుండా రోడ్లపై తిరగాలనే ప్రతిపక్షాలు ఆరాటపడుతున్నాయని మండిపడ్డారు. ప్రతి పేద వాడిని ఆత్మబంధువుగా చూసే వైయ‌స్ జగన్ వాళ్ల అవసరాలు తీర్చేందుకు అధిక ప్రాధాన్యమిస్తున్నారు అని నాని చెప్పుకొచ్చారు.

Read Also : Telangana Elections 2023 : ఆటో డ్రైవర్ల కోసం గులాబీ బాస్ కొత్త హామీ

  Last Updated: 20 Nov 2023, 03:47 PM IST