Kodali Nani Resign : వైసీపికి కొడాలి నాని రాజీనామా..? అసలు నిజం ఇదే..!!

Kodali Nani Resign : ఆరోగ్య కారణాలతో రాజకీయాలకు దూరంగా ఉండాలని అనుకుంటున్న ప్రచారంలోనూ వాస్తవం లేదన్నారు

Published By: HashtagU Telugu Desk
Kodali Nani (1)

Kodali Nani (1)

వైసీపీ లో రాజీనామాల పర్వం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. వైసీపీ పార్టీ కీలక నేత, విజయసాయి రెడ్డి రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా(Vijaya Sai Reddy Announced Retirement from Politics) చేస్తున్నట్లు ప్రకటించి షాక్ ఇచ్చాడు. తాను ఏ రాజకీయపార్టీ లోను చేరడంలేదు. వేరే పదవులో, ప్రయోజనాలో లేక డబ్బులో ఆశించి రాజీనామా చేరడంలేదు. ఈ నిర్ణయం పూర్తిగా నా వ్యక్తి గతం. ఎలాంటి ఒత్తిళ్లు లేవు. ఎవరూ ప్రభావితం చెయ్యలేదు. నాలుగు దశాబ్దాలుగా, మూడు తరాలుగా నన్ను నమ్మి ఆదరించిన వై యస్ కుటుంబానికి రుణపడి ఉన్నాను. రెండుసార్లు రాజ్యసభ సభ్యుడిగా అవకాశం ఇచ్చిన జగన్ (Jagan) గారికి, నన్ను ఇంతటి ఉన్నతస్థాయికి తీసుకెళ్ళిన భారతమ్మ గారికి సదా కృతజ్ఞుడిని అంటూ ట్వీట్ చేసాడు.

ఈయన రాజీనామా చేసిన కాసేపటికే అయోధ్య రామిరెడ్డి తాను రాజకీయాలకు గుడ్ బై చెపుతున్నట్లు ప్రకటించి మరింత షాక్ ఇచ్చాడు. ఇలా కీలక నేతలు వరుసగా రాజీనామాలు ప్రకటించడంతో వైసీపీ శ్రేణుల్లో ఆందోళనలో పడ్డారు. వీరి వ్యవహారం గురించి వార్తలు కొనసాగుతుండగానే మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని రాజకీయాలకు గుడ్ బై చెపుతున్నట్లు ఓ ట్వీట్ మరింత ఆందోళన పెంచింది. ‘ఆరోగ్యం కారణాల దృష్ట్యా రాజకీయాలకు దూరంగా ఉండాలనుకుంటున్నాను. ఈ నెల 25న వైసీపీకి రాజీనామా చేయబోతున్నాను. నన్ను ఎంతగానో ఆదరించిన గుడివాడ ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.’ అని కొడాలి నాని ట్వీట్ చేసినట్లుగా ఓ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ కావడం తో నిజమే కావొచ్చని పలు మీడియాలు సైతం బ్రేకింగ్ గా ప్రచారం చేయడం స్టార్ట్ చేసాయి. కానీ ఈ వార్తల్లో ఏమాత్రం నిజం లేదని నాని అధికారిక ప్రకటన చేసారు.

తన గురించి జరుగుతున్న ప్రచారంలో నిజం లేదన్నారు. తాను వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు జరుగుతున్న ప్రచారంలో నిజం లేదన్నారు. ఆరోగ్య కారణాలతో రాజకీయాలకు దూరంగా ఉండాలని అనుకుంటున్న ప్రచారంలోనూ వాస్తవం లేదన్నారు. అది ఫేక్ పోస్ట్ అని ఆయన తేల్చి చెప్పారు. అది ఎడిటెడ్ న్యూస్ అని, ఫేక్ అని, దాన్ని ఎవరూ నమ్మొద్దని స్వయంగా సోషల్ మీడియాలో తెలిపారు. నాని ప్రకటన తో వైసీపీ కి కాస్త ఊపిరి వచ్చినట్లు అయ్యింది.

  Last Updated: 24 Jan 2025, 09:54 PM IST