Site icon HashtagU Telugu

Kodali Nani’s Nomination : వివాదంలో కొడాలి నాని నామినేషన్…

Kodali Nai Nom

Kodali Nai Nom

వైసీపీ పార్టీ (YCP) తరుపున గుడివాడ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామిషన్ వేసిన కొడాలి నాని (Kodali Nani Nomination )..నామినేషన్ ఇప్పుడు వివాదాస్పదం (Controversial) అవుతుంది. నాని సమర్పించిన నామినేషన్ దరఖాస్తులో తప్పుడు సమాచారం అందించారని టీడీపీ నేతలు ఎన్నికల అధికారికి పిర్యాదు చేసారు. మున్సిపల్ ఆఫీస్ ను తన క్యాంపు ఆఫీస్ గా మార్చుకున్నారని ఫిర్యాదులో తెలిపారు. ఆఫీస్ ను అద్దెకు ఇచ్చినట్లు అధికారులు ఇచ్చిన పత్రాలను ఫిర్యాదులో జత చేసారు. తప్పుడు సమాచారం ఇచ్చి మోసం చేసిన నాని..నామినేషన్ ను తిరస్కరించాలని కోరారు. మరి దీనిపై ఎన్నికల అధికారులుఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

We’re now on WhatsApp. Click to Join.

ఇదిలా ఉంటె నిన్న కొడాలి నాని నామినేషన్ కార్యక్రమం జనాలు లేక వెలవెలబోయింది. భారీగా జనసమీకరణ చేయాలని, బలప్రదర్శన నిరూపించుకోవాలని నాని వర్గం గట్టిగానే ట్రై చేసినప్పటికీ జనాలు మాత్రం ఎన్ని డబ్బులు ఇచ్చిన వచ్చేది లేదని తేల్చి చెప్పడంతో..పదిమందితో వెళ్లి నామినేషన్ వేశారు నాని. దీనిని బట్టి చెప్పొచ్చు కొడాలి నాని ఫై నియోజకవర్గ ప్రజలు ఎంత ఆగ్రహం గా ఉన్నారో..ఐదేళ్లుగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసింది లేదని..ఇలాంటి వాడు మరోసారి గెలవద్దంటూ ఇప్పటికే ప్రజలు చెపుతూ వస్తున్నారు. బూతులు తిట్టే ఇలాంటి రాజకీయ నేత మాకు వద్దంటే వద్దు అంటూ ధైర్యంగా చెపుతున్నారు. ఈసారి గుడివాడ లో కూటమి భారీ విజయం సాధించడం ఖాయమని అంత అంటున్నారు. చూద్దాం ఏంజరుగుతుందో..!!

Read Also : Priyanka- Rahul : అమేథీ నుండి రాహుల్..రాయ్ బరేలీ నుండి ప్రియాంక బరిలోకి..?