గుడివాడ లో కొడాలి నాని (Kodali Nani) కి ఓటర్లు బుద్ది చెప్పిన..ఇంకా ఆయనలో మార్పు రాలేదని మరోసారి స్పష్టమైంది. ఇటీవల ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ పార్టీకి భారీ షాక్ ఇచ్చారు ఓటర్లు. ముఖ్యంగా మంత్రులకు ముఖం చూపించుకోలేని పరిస్థితి తెచ్చారు. 175 కు 175 కొడుతున్నాం..అంటూ మీసాలు మెలేసిన వారిని ఇంటికే పరిమితం చేసారు. అయినాగానీ కొంతమంది లో మార్పు రావడం లేదు. ముఖ్యంగా గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని. అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా మాట్లాడాడో..ఇప్పుడు కూడా విధంగా మాట్లాడుతూ మరింత ఛీ కొట్టించుకుంటున్నాడు.
గురువారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ఉన్నతస్థాయి సమావేశంలో ఇటీవల ఎన్నికల్లో ఓడిపోయిన నాయకులు, గెలిచిన నాయకులతో జగన్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా నాయకుల్లో ఆయన ధైర్యం నూరిపోసే ప్రయత్నం చేశారు. ఎవరూ అధైర్య పడాల్సిన అవసరం లేదన్న జగన్.. 40 శాతం ఓటు బ్యాంకు వైసీపీకి వచ్చిందన్నారు. వైసీపీ ప్రభుత్వ మంచి కార్యక్రమాలపైనా బురద జల్లారంటూ కూటమి పార్టీల ఫై ఆగ్రహం వ్యక్తం చేసిన జగన్… ప్రజలను నమ్మకంగా వంచిచారని వ్యాఖ్యానించారు. తాను త్వరలోనే ఓదార్పు యాత్ర చేయడం ద్వారా ప్రజల్లో భరోసా నింపే ప్రయత్నం చేస్తానన్నారు.
We’re now on WhatsApp. Click to Join.
ఇక ఈ సమావేశానికి హాజరైన కొడాలి నాని..సమావేశం అనంతరం మీడియా తో మాట్లాడుతూ..శకుని పాచికలు వేసినట్టుగా జనసేన, టీడీపీ, బిజెపికి కావలసిన పాచికలు పడ్డాయని , ఢిల్లీ నుంచి పాచికలు వేసినట్టుగా ఉందని ఈవీఎంలపై తమ పార్టీ అభిప్రాయం అదేనని తేల్చి చెప్పారు. మంచి చేసిన కూడా ఎందుకు ఓడిపోయామో అర్థం కావడం లేదని కొడాలి నాని వ్యాఖ్యానించారు. ఇక ఈ సమయంలో కార్యకర్తలకు అండగా ఉండాలని జగన్ చెప్పారని ఆ మేరకు ముందుకు వెళతామని చెప్పుకొచ్చారు.
చంద్రబాబు మాయ మాటలు చెప్పి.. షో చేసి.. గెలిచారని వ్యాఖ్యానించారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను ఇప్పటి వరకు అమలు చేయకుండా.. పోలవరం, అమరావతి సందర్శన యాత్రలంటూ.. నాటకాలు ఆడుతున్నారని అన్నారు. దమ్ముంటే.. సూపర్ సిక్స్ హామీలను ఎప్పుడు అమలు చేస్తారో చెప్పాలని ప్రశ్నించారు.
ఏదో ఒక రకంగా మాయ మాటలు చెప్పడం.. అధికారంలోకి రావడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అని కొడాలి విమర్శించారు. తాము ఓడిపోయినా.. సత్యం-ధర్మ-న్యాయం ఎప్పటికీ నిలబడుతుందన్నా రు. రుషికొండపై నిర్మించిన భవనాలను జగన్ సొంత ఆస్తిగా టీడీపీ నేతలు ప్రచారం చేస్తున్నారని.. కానీ, ఆయనేమీ సొంతగా వాటిని నిర్మించుకోలేదన్నారు. ప్రభుత్వం కోసమే నిర్మించారని అన్నారు. కానీ, ప్రభుత్వ తీరు చూస్తే.. జగన్‌పై బురదజల్లే ప్రయత్నం చేస్తోందని దుయ్యబట్టారు.
అధికారంలో ఉన్నప్పుడే.. జగన్ ప్రభుత్వ ఆస్తులను వినియోగించుకోలేదని.. ఇప్పుడు మాత్రంఎందుకు వినియోగించుకుంటారని.. ఆయనకు ప్రభుత్వ భవనాలు వాడుకునే ఖర్మ పట్టలేదని కొడాలి తనదైన శైలిలో వ్యాఖ్యానించారు. రుషి కొండభవనాలను చంద్రబాబు వాడుకుంటారో.. ఆయన మనవడికి రాసిస్తారో.. ఆయన ఇష్టమని అన్నారు. తమను ఎవరు టార్గెట్ చేసిన భయపడేది లేదని, ఎవరూ జగన్ వెంట్రుక కూడా పీకలేరన్నారు . సీఎం క్యాంపు కార్యాలయంలో విజిటర్ల కోసం ఏర్పాటు చేసిన ఫర్నిచర్ పై కూడా అసత్యపు ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఎంతో చెప్తే మొహాన పడేస్తాం అన్నారు.
Read Also : Mudragada Padmanabham : పేరు మార్చుకున్న ముద్రగడ పద్మనాభం