Site icon HashtagU Telugu

Gorantla Madhav Issue: టీడీపీ అన్ని వింగ్ లు కలిసి వచ్చినా….కొడాలి నాని..!!

kodali nani

kodali nani

వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ పై వస్తున్న ఆరోపణలపై ఆ పార్టీ కీలక నేత, ఎమ్మెల్యే కొడాలి నాని స్పందించారు. ఆ వీడియోలో ఉన్నది తాను కాదని గోరంట్ల చెబుతున్నా…సిగ్గు లేకుండా టీడీపీ నేతలు ఇంకా వాదిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రజా సమస్యలను గాలికి వదిలేసి అనవసర విషయాలపై టీడీపీ నేతలు దృష్టి పెట్టడం సిగ్గుచేటన్నారు.

ఎంపీ మాధవ్ చెబుతున్న వీడియో ఫేక్ అని పోలీసులే తేల్చినా…టీడీపీ నేతలు ఎందుకు రాద్ధాంతం చేస్తున్నారని ఆరోపించారు. టీడీపీ నేతలు ఏమైనా లింగ పరిశోధనలో నిష్ణాతులా అంటూ ప్రశ్నించారు. మాధవ్ వీడియోను పట్టుకుని టీడీపీ వేలాడినా…వైసీపీని, జగన్నుటీడీపీ ఏం చేయలేదన్నారు. తెలుగు మహిళలు, తెలుగు యువత, తెలుగు వృద్ధులంతా కలిసి వచ్చినా…వైసీపీని ఏం చేయలేరంటూ ఎద్దేవా చేశారు కొడాలి నాని.