Gudivada Casino Issue : ఢిల్లీకి చేరిన గుడివాడ కాసినో.!

కృష్ణా జిల్లా గుడివాడ కాసినో ఢిల్లీ కి చేరింది. అక్కడి ఈడీకి టీడీపీ ఎంపీ రామ్మోహ‌న్ నాయుడు ఫిర్యాదు చేశాడు.

  • Written By:
  • Publish Date - February 8, 2022 / 04:33 PM IST

కృష్ణా జిల్లా గుడివాడ కాసినో ఢిల్లీ కి చేరింది. అక్కడి ఈడీకి టీడీపీ ఎంపీ రామ్మోహ‌న్ నాయుడు ఫిర్యాదు చేశాడు. క్యాసినోపై విచార‌ణ జ‌ర‌పాల‌ని కోరాడు.గోవా నుంచి యువ‌తుల‌ను ఏపీకి తీసుకొచ్చారు. క్యాసినో, విమాన టికెట్లకుసంబంధించిన‌ ప‌లు ఆధారాలను ఈడీ కి అందచేశాడు.500 కోట్ల రూపాయ‌లు చేతులు మారాయ‌న్న టీడీపీ నేత‌లు ఆరోపణలకు తగిన ఆధారాలు పొందుపరిచారు.ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని కృష్ణా జిల్లా గుడివాడలో సంక్రాంతి స‌మ‌యంలో క్యాసినో నిర్వహించిన విషయం విదితమే. ఆ రోజు నుంచి పలు విధాలుగా టీడీపీ దానిపై పోరాడుతోంది. సంక్రాంతి ముగిసిన తరువాత కాసినో జరిగిన ప్రాంతానికి టీడీపీ నిజనిర్దారణ కమిటీ వెళ్లే ప్రయత్నం చేసింది. ఆ రోజు నుంచి వైసీపీ, టీడీపీ పోరుగా మారింది. వీడియో ఆధారాలను టీడీపి బయట పెట్టింది. వాటిని కాదని మంత్రి కొడాలి హుంకరించాడు. చంద్రబాబు మీద అనుచిత వ్యాఖ్యలతో దూకుడు ప్రదర్శించాడు. చివరకు ఆయనే కాసినో నేను కాదు ఎమ్మెల్యే వల్లభనేని ఆడించాడని సైడ్ ట్రాక్ పట్టించాడు. దానిపై బీజేపీ ఏపీ శాఖ కూడా ధర్నాకు దిగింది. దాంతో ఒక మెట్టు దిగిన కొడాలి రాజీ బాట పట్టాడు. టీడీపీ నేతలు ఈ విషయాన్ని ఇంతటితో వదిలితే తాను ఇక తిట్లును ఉపయోగించను అని ఒప్పందానికి వచ్చాడు. ఫలితంగా కొన్ని రోజులు సద్దు మణిగింది. ఉద్యోగుల సమ్మె రావటం, టీడీపీ లీడర్ జైన్ ఒక బాలిక పై లైంగిక వేధింపు కేసు బయటకు రావడంతో కాసినో మరుగున పడింది. ఇప్పుడు ఈడీ కి ఫిర్యాదు చేయటంతో మళ్ళీ కాసినో తెరమీదకు వచ్చింది. ఢిల్లీ కేంద్రంగా పోరాటం చేయడానికి టీడీపి సిద్దం అయింది. ఇప్పటికే గవర్నర్ వరకు ఫిర్యాదు చేసిన ఆ పార్టీ రాష్ట్రపతికి కూడా ఫిర్యాదును అంద చేయాలి అని భావిస్తోంది.
ఢిల్లీలో మంగళవారం టీడీపీ లీడర్ ఆల‌పాటి రాజాతో క‌లిసి ఎంపిలు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్ (ఈడీ)కి క్యాసినో వ్య‌వ‌హారంపై ఫిర్యాదు చేశారు. ఈడీ అధికారులను కలిసిన అనంత‌రం రామ్మోహన్ నాయుడు మీడియాతో మాట్లాడుతూ… క్యాసినోపై విచార‌ణ జ‌ర‌పాల‌ని కోరిన‌ట్లు చెప్పారు. గోవా నుంచి యువ‌తుల‌ను ఏపీకి తీసుకొచ్చార‌ని చెప్పారు. ఈడీ విచార‌ణ జ‌రిపితే పూర్తి వివ‌రాలు బ‌య‌ట‌ప‌డ‌తాయ‌ని తెలిపారు. క్యాసినో, విమాన టికెట్లకు సంబంధించిన‌ ప‌లు ఆధారాల‌ను ఈడీకి స‌మ‌ర్పించామ‌ని చెప్పారు. పేకాట, డ్ర‌గ్స్, జూదం వంటి కార్య‌క‌ల‌పాల‌తో 500 కోట్ల రూపాయ‌లు చేతులు మారాయ‌ని ఆల‌పాటి రాజా ఆరోపించారు. మొత్తం మీద గుడివాడ కాసినో..ఢిల్లీకి చేరింది. ఆ విషయాన్ని ముందుగానే గమనించిన కొడాలి రాజకీయ దాడికి సిద్దంగా ఉన్నాడని సమాచారం. సో, కాసినో వ్యవహారం మంత్రివర్గ మార్పు వరకు ఉంటుందని విపక్షల్లో టాక్.