వైసీపీ మాజీ మంత్రి కొడాలి నాని (Kodali Nani)..చంద్రబాబు (Chandrababu) కు జై కొట్టి వార్తల్లో నిలిచాడు. ఏపీ ఎన్నికల్లో కూటమి భారీ విజయం సాధించి అధికారం చేపట్టిన సంగతి తెలిసిందే. 4 వ సారి ముఖ్యమంత్రి గా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు..తన మార్క్ పాలనను మొదలుపెట్టి ప్రజల్లో సంతోషం నింపుతున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కోటిగా నెరవేరుస్తూ..ప్రజలు తమపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ వస్తున్నారు. ఇప్పటికే పలు హామీలను నెరవేర్చిన బాబు..తాజాగా రాష్ట్రంలో ఉచిత ఇసుక (Free Sand) ను అమల్లోకి తీసుకొచ్చి..నిర్మాణాలు కట్టుకునే ప్రజల్లో ఆనందం నింపారు.
We’re now on WhatsApp. Click to Join.
ఎటువంటి నగదు లావాదేవీలకు ఆస్కారం లేకుండా డిజిటల్ చెల్లింపుల ద్వారా మాత్రమే నామమాత్రపు రుసుములను స్వీకరిస్తూ అత్యంత పారదర్శకంగా ఈ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చారు. ప్రభుత్వానికి ఎటువంటి రాబడి లేకుండా కేవలం సీనరేజ్ ఛార్జి, నిర్వహణ ఖర్చులు వంటివి మాత్రమే వినియోగదారుల నుంచి తీసుకొని, ఇసుకను అందజేస్తున్నారు. ఉచిత ఇసుక కావాలనుకునే వారు శాండ్ డిపోకు వెళ్లి ఆధార్, ఫోన్ నంబర్, అడ్రస్, వాహనం నంబర్ అందజేయాలి. ఆ తరువాత అధికారులు నిర్ణయించిన లోడింగ్, రవాణా ఫీజును ఆన్లైన్లో చెల్లించాలి. ఖరారు చేసిన ఇసుక ధరను డిజిటల్ రూపంలో తీసుకుంటారు. ముందు వచ్చినవారికే ముందు లోడ్ చేస్తారు.ఒకరికి రోజుకు 20 టన్నుల ఇసుక తీసుకెళ్లేందుకు మాత్రమే అనుమతి ఉంటుంది. ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే నిల్వకేంద్రాలు పని చేస్తాయి.
కాగా చంద్రబాబు నిజంగా ఇసుకను ఫ్రీగా ఇస్తున్నారా..లేదా అనేది స్వయంగా తెలుసుకునేందుకు మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని తన సొంత ట్రాకర్ట్ తో వెళ్లారు. అందరి లాగానే టన్నుకి రూ.88 చెల్లించాడు. తన సొంత ట్రాక్టర్ కావటంతో రవాణా చార్జీలు కూడా లేకపోవటంతో కేవలం రూ. 500 లోపే డబ్బు కట్టి ట్రాక్టర్ ఇసుక తీసుకుని వెళ్లాడు. వైసీపీ సోషల్ మీడియాలో హడావిడి చూసి విమర్శలు చేద్దాం అని వచ్చి…..ఇక్కడ సీన్ చూసి కొడాలి నాని షాక్ అయ్యాడు. బాబు..బాబే అంటూ తన వెంటవచ్చిన వారితో అంటూ వెళ్ళిపోయాడు.
Read Also : Head Coach Gautam Gambhir : టీమిండియా హెడ్ కోచ్‌గా గౌతమ్ గంభీర్