Site icon HashtagU Telugu

Kodali Nani: సిగ్గుందా.. బాలకృష్ణ? తండ్రిని చంపిన చంద్రబాబుతో షోలా..?

టీడీపీ అధినేత చంద్రబాబు,హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణలపై అధికారపార్టీ ఎమ్మెల్యే మాజీ మంత్రి కొడాలినాని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ చనిపోయి 25 సంవత్సరాలు దాటిన షోల పేరుతో కొడుకు, అల్లుడు ఆయన్ను ఇంకా హింసిస్తున్నారంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తండ్రిని చంపిన బాబుతో షోలు చేస్తున్నబాలయ్యబాబు నీకు సిగ్గుందా అంటూ ప్రశ్నించారు. గుడివాడ శ్రీరామపురంలో గడపగడపకు కార్యక్రమంలో పాల్గొన్న కొడాలి నాని…మీడియాతో మాట్లాడారు. చంద్రబాబుపై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు.

గతిలేక ఎన్టీఆర్ కాళ్లు పట్టుకున్నాడని మండిపడ్డారు. ఎన్టీఆర్ కాళ్ల దగ్గర ఉండే ఆయనకు వెన్నుపొడిచాడని …ఇప్పుడు ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహంవ్యక్తం చేశారు. ఎన్టీఆర్ కు మంచి బాలయ్య నటిస్తున్నారని..చంద్రబాబుతో కలిసి షోలు చేస్తున్నారని ఆగ్రహించారు.

https://youtu.be/V4BP2ViTls8

Exit mobile version