పవన్ డెడ్ లైన్ , చంద్రబాబు ఇచ్చిన పెట్రోల్ ధర తగ్గింపు ఆందోళనపై మంత్రి కొడాలి తన స్టైల్ లో అటాక్ చేసాడు. ఆయన ఇచ్చిన కౌంటర్ జనసేనకు తగిలింది. విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేస్తున్న బీజేపీలో ఎందుకున్నావో సమాధానం చెప్పాలని కౌంటర్ ఇచ్చాడు. ఢిల్లీ వెళ్లి ఆందోళన చేయాలని పవన్ కు చురకేసాడు.
https://twitter.com/Kiran_reddy7777/status/1457957373939646466
ఇక చంద్రబాబు హయాంలో పెంచిన పెట్రోల్ , డీజిల్ పన్నులను బయటకు తీసాడు. చిల్లర రాజకీయాలు మానుకోవాలని ఇద్దరికి హితవు పలికాడు. పవన్ , బాబు కలిసి రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ కంట్రోలో లేకుండా చేయాలని కుట్ర పన్నారని నాని ఆరోపణ చేశాడు. ఒక వేళ ధర్నా సందర్భంగా పెట్రోల్ బ్యాంకుల్లో ఏదయినా జరిగితే బాబు బాధ్యత వహించాలని ముందుగా హెచ్చరించాడు. బ్యాంకులను తగల పెట్టాలని కుట్ర చేసాడని నాని ఆరోపించాడు. మొత్తం మీద ఇంకా ధర్నా రోజు రాకముందే పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపు డిమాండ్ రాజకీయ కయ్యానికి దా రితీయడం ఏవైపు వెళ్తుందో చూడాలి.
