Kodali Nani : రాజధాని నిర్మాణం ఒక గుదిబండ – కొడాలి నాని

ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాజధాని (AP Capital) అంశం మరోసారి తెరపైకి వచ్చింది. ఐదేళ్లుగా ఏపీకి రాజధానే లేకుండా చేసారని సీఎం జగన్ (CM Jagan) ఫై ప్రతిపక్ష పార్టీలు విమర్శలు చేస్తున్నాయి. గత ప్రభుత్వం అమరావతి (Amaravathi) ని రాజధానిగా ప్రకటించి అక్కడ పనులు చేపడితే..ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్ సర్కార్ మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తీసుకొచ్చి అసలు రాజధానే లేకుండా చేసారని ప్రజలు సైతం మండిపడుతున్నారు. ప్రస్తుతం ఎన్నికల హడావిడి […]

Published By: HashtagU Telugu Desk
Kodalinani Ap

Kodalinani Ap

ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాజధాని (AP Capital) అంశం మరోసారి తెరపైకి వచ్చింది. ఐదేళ్లుగా ఏపీకి రాజధానే లేకుండా చేసారని సీఎం జగన్ (CM Jagan) ఫై ప్రతిపక్ష పార్టీలు విమర్శలు చేస్తున్నాయి. గత ప్రభుత్వం అమరావతి (Amaravathi) ని రాజధానిగా ప్రకటించి అక్కడ పనులు చేపడితే..ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్ సర్కార్ మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తీసుకొచ్చి అసలు రాజధానే లేకుండా చేసారని ప్రజలు సైతం మండిపడుతున్నారు.

ప్రస్తుతం ఎన్నికల హడావిడి మొదలుకావడం తో వైసీపీ (YCP) నేతలను ప్రజలు రాజధాని ఎక్కడ అని నిలదీస్తున్నారు. దీంతో అసలు రాజధాని ఎందుకు అన్నట్లు కొంతమంది అధికార పార్టీ నేతలు మాట్లాడుతూ వస్తున్నారు. ఈ క్రమంలో గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని (Kodali Nani ) సైతం రాజధాని అంశంపై సంచలన వ్యాఖ్యలు చేసారు. రాజధానితో సామాన్య ప్రజలకు పనేముంటుందని ఆయన ప్రశ్నించారు.

We’re now on WhatsApp. Click to Join.

రాజధానిలో సెక్రటేరియట్, అసెంబ్లీ, కోర్టు, కొన్ని కార్యాలయాలు కడతామని, అంతకంటే ఏముంటాయని కొడాని నాని వ్యాఖ్యానించారు. దేశంలో రాజధాని నిర్మించిన వారు ఎవరైనా ఉన్నారా అని నిలదీశారు. చంద్రబాబు తీసుకున్న రాజధాని నిర్మాణం ఒక గుదిబండ అని వ్యాఖ్యానించారు. విశాఖ రాజధానిగా అన్ని విధాలుగా అనువైన ప్రాంతమని కొడాలి నాని పేర్కొన్నారు. అలాగే చంద్రబాబు , పవన్ కళ్యాణ్ ఫై పలువిమర్శలు చేసారు.

చంద్రబాబుకు సింగిల్ పోటీ చేసే దమ్ము లేదని , చంద్రబాబు, పవన్ ఎక్కడ పోటీ చేస్తారో వారికే తెలియదని విమర్శించారు. తమ పక్కన ఫ్లెక్సీలు పెట్టు దమ్ము పవన్‌కు ఉందా అని ప్రశ్నించారు. తాము ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధమని, పవన్ ఎవరితో యుద్ధం చేస్తారని ప్రశ్నించారు.

Read Also : TS : ఆ సిపాయే లక్ష రుణమాఫీ చెయ్యలేదు… మరి ఈ సిపాయి ఎలా చేయగలడు..?- ఈటెల

  Last Updated: 22 Feb 2024, 11:43 PM IST