Kodali Nani : వైసీపీపై షర్మిల ప్రభావం ఏమాత్రం ఉండదు – కొడాలి నాని

  • Written By:
  • Publish Date - January 4, 2024 / 08:49 PM IST

వైస్ షర్మిల కాంగ్రెస్ లో చేరడం ఫై వైసీపీ నేతలు (YCP Leaders) వరుసగా స్పందిస్తున్నారు. రాహుల్ సమక్షంలో నేడు షర్మిల (Sharmila ) కాంగ్రెస్ కండువా కప్పుకోవడంతో పాటు తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసింది. వైఎస్సార్ బిడ్డగా తిరిగి కాంగ్రెస్ లో చేరుతున్నందుకు సంతోషంగా ఉందని , దేశ సెక్యులర్ పునాదుల్లో భాగమైన కాంగ్రెస్ పార్టీలో తాను భాగమవుతున్నందుకు హర్షం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఏ బాధ్యత అప్పగించినా నిబద్ధతతో పనిచేస్తానని వైఎస్ షర్మిల తెలిపారు.

ఇక షర్మిల ఏపీ కాంగ్రెస్ చీఫ్ గా వ్యవహరించబోతారని తెలుస్తుంది..ఇదే క్రమంలో పలువురు వైసీపీ నేతలతో పాటు ఇతర పార్టీల నేతలు సైతం షర్మిల వెంట నడవబోతున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణ (RK) వైసీపీ కి రాజీనామా చేయడం జరిగింది. త్వరలోనే ఆయన కాంగ్రెస్ లో చేరబోతున్నట్లు తెలుస్తుంది. ఇదిలా ఉంటె షర్మిల ఏపీ కాంగ్రెస్ పగ్గాలు చేపడితే వైసీపీ కి భారీ నష్టం వాటిల్లడం ఖాయమని రాజకీయ వర్గాలు భావిస్తుండడం తో వైసీపీ నేతలు స్పందిస్తున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

తాజాగా మాజీ మంత్రి , గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని (Kodali Nani) మాట్లాడుతూ.. రాజకీయ మనుగడ కోసమే షర్మిల కాంగ్రెస్‌లో చేరారని . ఏపీలో కాంగ్రెస్ పార్టీ రిజెక్టెడ్ పార్టీ, ఏపీకి ద్రోహం చేసిన పార్టీ అంటూ ఆయన తీవ్రంగా మండిపడ్డారు. ఏపీలో కాంగ్రెస్ పార్టీ తిరిగి కోలుకునే పరిస్థితి లేదన్నారు. షర్మిల కాంగ్రెస్‌లో చేరితే తమకొచ్చే ఇబ్బందేం లేదన్నారు. తెలంగాణలో ఎన్నికల సమయంలో తన పార్టీని విలీనం చేస్తామంటే అక్కడ కాంగ్రెస్ శ్రేణులు వద్దన్నాయన్నారు. అక్కడ లాభం లేదనే కాంగ్రెస్‌లో విలీనం చేయించలేదన్నారు. ఆమె కాంగ్రెస్‌లో చేరితే తమ ఓటు బ్యాంక్ ఎందుకు చీలుతుందన్నారు. అలాంటప్పుడు ఎన్టీఆర్‌ కూతురు పురంధేశ్వరి బీజేపీలో చేరితే టీడీపీ ఓటు బ్యాంక్ చీలదా? అని ప్రశ్నించారు. ఏపీలో కాంగ్రెస్‌కు ఒక శాతం ఓటు బ్యాంక్‌ కూడా లేదని చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి వచ్చే 1 శాతం ఓట్ల వల్ల వైసీపీకి నష్టం ఏం లేదన్నారు. పురంధేశ్వరి ప్రభావం టీడీపీపై ఎంత ఉంటుందో.. షర్మిల ప్రభావం వైసీపీపై అంతే ఉంటుందన్నారు.

Read Also : Lok Sabha Polls: లోక్‌సభ ఎన్నికల మేనిఫెస్టోపై కాంగ్రెస్ కసరత్తు