Site icon HashtagU Telugu

Kodali Nani: `జూనియ‌ర్ – షా` భేటీ ర‌హ‌స్యం ఇదే!

Ntr Amitshah Kodali

Ntr Amitshah Kodali

కేంద్ర హోంమంత్రి అమిత్ షా, టాలీవుడ్ బాద్ షా జూనియ‌ర్ ఎన్టీఆర్ భేటీ గుట్టును మాజీ మంత్రి కొడాలి నాని బ‌య‌ట‌పెట్టారు. తెలుగు రాష్ట్రాల్లో బీజేపీని బలోపేతం చేసేందుకు అమిత్ షా జూనియర్ ఎన్టీఆర్ ను కలిశారని భావించారు. “జూ. ఎన్టీఆర్ మరియు అమిత్ షాల మధ్య సమావేశానికి సంబంధించి బిజెపి విడుదల చేసిన అధికారిక ప్రకటనతో నేను ఏకీభవించడం లేదు,” అని కొడాలి అన్నారు. జూనియర్ ఎన్టీఆర్ ఇప్పటికే 25 కంటే ఎక్కువ సినిమాల్లో విభిన్న పాత్రలు పోషించారని , అతని అనేక చిత్రాలు డబ్బింగ్ అయ్యాయి. హిందీలో తీసిన త్రిబుల్ ఆర్ లో జూనియర్ ఎన్టీఆర్ నటనను అమిత్ షా అభినందించాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు.

ప‌లు ర‌కాలుగా జూనియ‌ర్, అమిత్ షా భేటీల‌ను విశ్లేషిస్తోన్న మీడియాకు కీల‌క పాయింట్ ను మాజీ మంత్రి కొడాలి అందించారు. ఆయ‌న వ్యాఖ్య‌ల‌ను విశ్వ‌సించ‌డానికి అవ‌కాశం లేక‌పోలేదు. ఎందుకంటే, పూర్వం నుంచి కొడాలి, జూనియ‌ర్ మ‌ధ్య స‌త్సంబంధాలు ఉన్నాయి. రాజ‌కీయాల్లోకి కొడాలి నాని వేదిక క‌ల్పించిన హీరో జూనియ‌ర్. ఆయ‌నంటే ప్రాణం ఇస్తాన‌ని ప‌లుమార్లు కొడాలి చెప్పిన విష‌యం విదిత‌మే. జూనియ‌ర్ కోటా కింద కొడాలి నానికి గుడివాడ టిక్కెట్‌ను టీడీపీ ఇచ్చింది. ఆనాడు జూనియ‌ర్ ప్ర‌తిపాద‌న‌కు అంగీకరిస్తూ నానికి టీడీపీ టిక్కెట్ ఇవ్వ‌డం జ‌రిగింది. ఆ తరువాత జూనియ‌ర్, చంద్ర‌బాబుకు మ‌ధ్య గ్యాప్ వ‌చ్చిన క్ర‌మంలో కొడాలి టీడీపీకి గుడ్ బై చెప్పారు.

కుటుంబ స‌భ్యులుగా కొడాలి, జూనియ‌ర్ ఉంటారు. వాళ్లిద్ద‌రి మ‌ధ్యా ఉన్న సాన్నిహిత్యం దృష్ట్యా కొడాలి చేసిన వ్యాఖ్య‌ల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోవ‌డానికి అవ‌కాశం ఉంది. బీజేపీ పార్టీని ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో విస్త‌రింప చేసుకోవ‌డానికి జూనియ‌ర్ ను అమిత్ షా ఉప‌యోగించుకోవాల‌ని చూస్తున్నార‌ట‌. అంతేకాదు, ఎలాంటి ఉప‌యోగం లేకుండా మోడీ, అమిత్ షా ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయ‌ర‌ని చెబుతున్నారు. అంటే, బీజేపీ విస్త‌ర‌ణ‌కు జూనియ‌ర్ ను ఉప‌యోగించుకోవాల‌ని బీజేపీ ఫిక్స్ అయింద‌న్న‌మాట‌. అంటే, టీడీపీకి జూనియ‌ర్ దూరం అవుతార‌ని ప‌రోక్షంగా కొడాలి సంకేతాలు ఇచ్చిన‌ట్టే ఆ పార్టీలోని లోకేష్ గ్రూప్ సోషల్ మీడియా వేదిక‌గా ప్ర‌చారానికి దిగింది.

జూనియర్ ఎన్టీఆర్ విష‌యంలో ఏ చిన్న అవ‌కాశం దొరికిన‌ప్ప‌టికీ లోకేష్ గ్రూప్ డామేజ్ చేయ‌డానికి ఏ మాత్రం వెనుకాడ‌డంలేదు. గ‌తంలోనూ సినిమా విడుద‌ల సంద‌ర్భంగా ప్లాప్ టాక్ తీసుకురావ‌డానికి ప‌నిచేశార‌ని ప్ర‌చారం జ‌రిగింది. జూనియ‌ర్ మాట నార్నే శ్రీనివాస‌రావు వైసీపీలోకి వెళ్లిన‌ప్పుడు ఎన్టీఆర్ కూడా వెళుతున్నాడ‌ని ర‌చ్చ చేశారు. ఇటీవ‌ల అసెంబ్లీలో జ‌రిగిన భువ‌నేశ్వ‌రి ఇష్యూ మీద జూనియ‌ర్ ను వీలున్నంత డామేజ్ చేసే ప్ర‌య‌త్నం చేశార‌ని పార్టీలోని ఒక గ్రూప్ చెప్పుకుంటోంది. తాజాగా అమిత్ షా, జూనియ‌ర్ భేటీని కూడా సినిమా వ‌ర‌కు ప‌రిమితం చేస్తూ లోకేష్ గ్రూప్ మాట్లాడుతోంది. కానీ, చిర‌కాల మిత్రుడు కొడాలి నాని మాత్రం జూనియ‌ర్, షా భేటీ వెనుక బీజేపీ విస్త‌ర‌ణ వ్యూహం ఉంద‌ని కుండ‌బ‌ద్ధ‌లు కొట్టారు. ఏది నిజ‌మో భ‌విష్య‌త్ నిర్ణ‌యించాలి.