Kodali Nani: వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి కొడాలి నాని మరోసారి న్యాయపరమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. అధికారంలో ఉన్న సమయంలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆయనకు సమస్యగా మారాయి. ఆంధ్రా యూనివర్శిటీ న్యాయ కళాశాల విద్యార్థిని అంజనప్రియ 2024లో విశాఖపట్నం త్రీటౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తూ, కొడాలి నాని మూడు సంవత్సరాలపాటు టిడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మరియు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పై సామాజిక మాధ్యమాల్లో తీవ్రమైన దూషణలు చేశారని ఆరోపించారు.
అంజనప్రియ తన ఫిర్యాదులో పేర్కొంటూ, ఈ వ్యాఖ్యల్లో మహిళలకు అవమానకరంగా అనిపించే పదజాలాన్ని ఉపయోగించారని, ఆ వ్యాఖ్యలు తన మనోభావాలను తీవ్రంగా దెబ్బతీశాయని తెలిపింది. “ఒక మహిళగా ఆ తిట్లు భరించడం అసాధ్యం అయింది. ఇలాంటి అసభ్య పదజాలం ఎవరినైనా మానసికంగా కలతపరుస్తుంది” అని ఆమె ఫిర్యాదులో స్పష్టం చేసింది.
ఈ ఫిర్యాదు ఆధారంగా అప్పటి సీఐ రమణయ్య ఐటీ యాక్ట్‌తో పాటు U/s 353(2), 352, 351(4) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఆ తరువాత ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతూనే ఉంది. తాజాగా పోలీసులు చర్యలు ముమ్మరం చేశారు.
POCSO : ‘ఢీ’ కొరియోగ్రాఫర్ కృష్ణ మాస్టర్ పై పోక్సో కేసు.. మైనర్‌పై లైంగిక వేధింపులు
ఆదివారం కృష్ణా జిల్లా గుడివాడలోని కొడాలి నాని నివాసానికి పోలీసులు వెళ్లి 41 సీఆర్‌పీసీ నోటీసులు అందజేశారు. ఈ నోటీసుల ప్రకారం కొడాలి నాని దర్యాప్తు అధికారుల ముందు విచారణకు హాజరుకావాల్సి ఉంటుంది. నోటీసులో పేర్కొన్న షరతులకు అనుగుణంగా ఆయన వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాల్సి ఉంటుందని పోలీసులు తెలిపారు.
ఈ పరిణామం రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారి తీసింది. కొడాలి నాని వ్యాఖ్యలు గతంలో ఎన్నో సార్లు వివాదాస్పదమయ్యాయి. ఆయనపై విపక్షాలు పలు ఆరోపణలు చేసినా, ఈసారి పరిస్థితి భిన్నంగా ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. ఎందుకంటే ఈసారి ఒక మహిళ వ్యక్తిగతంగా తన మనోభావాలు దెబ్బతిన్నాయని చెబుతూ న్యాయపరమైన చర్య తీసుకోవడం కేసుకు కొత్త మలుపు తీసుకొచ్చింది.
MS Dhoni: సీఎస్కే జట్టులో కొన్ని లోపాలు ఉన్నాయి.. ఎంఎస్ ధోనీ సంచలన వ్యాఖ్యలు