Kodali Nani : కొడాలి నాని కొత్త లుక్ చూశారా? గుండుతో.. తిరుమలలో మాజీ మంత్రి..

Kodali Nani : మాజీ మంత్రి, గుడివాడ మాజీ ఎమ్మెల్యే వైసీపీ ఓడిపోయి కూటమి అధికారంలోకి వచ్చాక ఎక్కువగా కనపడటం మానేశారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు రోజూ భూతులతో రెచ్చిపోయి హడావిడి చేసిన కొడాలి నాని ఇప్పుడు సైలెంట్ అయిపోయారు. ఇటీవల పలువురు టీడీపీ కార్యకర్తలు ఇంటికెళ్లి మరీదాడి చేయడంతో అసలు బయట ఎక్కడా కనిపించట్లేదు. ఒకరకంగా చెప్పాలంటే చాలా మంది వైసీపీ నాయకుల లాగే కొడాలి నాని కూడా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు. అయితే చాలా రోజుల […]

Published By: HashtagU Telugu Desk
Kodali Nani Appeared in Tirumala With New Look Video goes Viral

Kodali Nani

Kodali Nani : మాజీ మంత్రి, గుడివాడ మాజీ ఎమ్మెల్యే వైసీపీ ఓడిపోయి కూటమి అధికారంలోకి వచ్చాక ఎక్కువగా కనపడటం మానేశారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు రోజూ భూతులతో రెచ్చిపోయి హడావిడి చేసిన కొడాలి నాని ఇప్పుడు సైలెంట్ అయిపోయారు. ఇటీవల పలువురు టీడీపీ కార్యకర్తలు ఇంటికెళ్లి మరీదాడి చేయడంతో అసలు బయట ఎక్కడా కనిపించట్లేదు. ఒకరకంగా చెప్పాలంటే చాలా మంది వైసీపీ నాయకుల లాగే కొడాలి నాని కూడా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు.

అయితే చాలా రోజుల తర్వాత కొడాలి నాని కనిపించారు. కానీ ఈసారి సరికొత్త లుక్ లో కనిపించి అందరికి షాక్ ఇచ్చాడు. ఎప్పుడూ ఫుల్ జుట్టు, ఫుల్ గా గడ్డంతో మెడలో రుద్రాక్ష మాలలు వేసి రౌడీలాంటి లుక్ తో కనపడే కొడాలి నాని ఒక్కసారి సౌమ్యుడిగా మారిపోయాడు. నేడు తిరుమల వెళ్లి వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు కొడాలి నాని. ఈ క్రమంలో స్వామి వారికి మొక్కులు చెల్లించి తలనీలాలు ఇచ్చారు.

దీంతో కొడాలినాని చాలా ఏళ్ళ తర్వాత మొదటిసారి గుండుతో కనపడ్డారు. తిరుమలలో ఆలయం బయట కొడాలి నాని కనపడ్డ విజువల్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే మీడియా ఆయన దగ్గరకు వెళ్లినా కొడాలి నాని ఏమి మాట్లాడకుండా వెళ్ళిపోయాడు. దీంతో ప్రస్తుతం కొడాలి నాని కొత్త లుక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మీరు కూడా కొడాలి నాని కొత్త లుక్ చూసేయండి.

 

Also Read : Kadambari Jethwani Case : జత్వాని కేసులో పోలీసుల ముందస్తు బెయిల్ విచారణ వాయిదా!

  Last Updated: 15 Oct 2024, 04:39 PM IST