Site icon HashtagU Telugu

Chandrababu Remand: చంద్రబాబుని అరెస్ట్ చేసి జగన్ తప్పు చేశాడు

Chandrababu Arrest

New Web Story Copy 2023 09 14t162321.302

Chandrababu Remand: దేశ రాజకీయాల్లో పెను సంచలనంగా మారిన చంద్రబాబు అరెస్టుపై ప్రముఖులు ఒక్కొక్కరు స్పందిస్తున్నారు. సినిమా, రాజకీయం అనే తేడా లేకుండా ఒక్కొక్కరుగా ఆయన అరెస్టును ఖండిస్తున్నారు. ఇప్పటికే బెంగాల్ టైగర్ సీఎం మమతా బెనర్జీ ఘాటుగా రియాక్ట్ అయ్యారు. రాష్ట్రంలోని విపక్షాలు జగన్ వైఖరిని తప్పుబట్టాయి. తెలంగాణలోనూ చంద్రబాబు రిమాండ్ పై నిరసనలు వెల్లువెత్తుతున్నాయి, ఐటీ ఉద్యోగులు ఇప్పటికే రోడ్లపైకి వచ్చి నిరసన తెలుపుతున్నారు. తాజాగా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు , కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు.

కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. ఒక మాజీ ముఖ్యమంత్రిని అరెస్టు చేసే విధానం ఇది కాదన్నారు. ముందుగా నోటీసు ఇచ్చి సంప్రదించిన తర్వాత అరెస్టు చేయాల్సిందని తెలిపారు. ఇలా కక్షపూరిత రాజకీయాలు మంచిది కాదని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో పద్ధతి ప్రకారం డిప్యూటీ సీఎంను అరెస్ట్ చేశామని తెలిపారు. దర్యాఫ్తు సంస్థలు విచారించిన తర్వాత ఆధారాలు చూపించి అప్పుడు అరెస్ట్ చేశామని గుర్తు చేశారు. ఏదేమైనా మాజీ సీఎం అరెస్ట్ విధానం సరికాదని అన్నాడు కిషన్ రెడ్డి.

చంద్రబాబు అరెస్టుపై ఇప్పటికే మాజీ బీజేపీ చీఫ్ బండి సంజయ్ స్పందించారు. బండి కూడా బాబు అరెస్ట్ విధానాన్ని తప్పుబట్టారు. తప్పు చేస్తే ఒక పద్దతి ప్రకారం వ్యవహరించాలని సూచించాడు. ఇక చంద్రబాబు అరెస్టుని హైదరాబాద్ ఐటీ ఉద్యోగులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. సైబర్ టవర్స్ వద్దకు వచ్చి నిరసన ర్యాలీలు చేపట్టారు.

Also Read: Chandrababu Remand: వచ్చేది చంద్రబాబు అధికారమే: నందమూరి రామకృష్ణ