శనివారం మధ్యాహ్నం నుంచి సోషల్ మీడియాలో జనసేన నేత, తిరుపతి ఇంచార్జి కిరణ్ రాయల్ (Kiran Royal) వ్యవహారం సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. నగరానికి చెందిన ఓ మహిళతో ఆయన సాగించిన వివాహేతర సంబంధం, ఆ మహిళ నుంచి తీసుకున్న డబ్బు, బంగారం వంటి అంశాలపై బాధిత మహిళ ఓ వీడియో విడుదల చేయడంతో ఈ వ్యవహారం వైరల్ అయింది. ముఖ్యంగా వైసీపీ అనుకూల వర్గాలు ఈ వీడియోను విస్తృతంగా షేర్ చేస్తూ, మరిన్ని వివరాలు బయటకు తెస్తూ సోషల్ మీడియాలో నానా రచ్చ చేస్తున్నారు.
తిరుపతికి చెందిన లక్ష్మి అనే మహిళతో కిరణ్ రాయల్ ఏళ్ల తరబడి వివాహేతర సంబంధాన్ని కొనసాగించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆమె నుంచే కిరణ్ దాదాపు రూ.1.20 కోట్లు తీసుకున్నారని, ఇప్పటి వరకు ఆ మొత్తాన్ని పూర్తిగా తిరిగి చెల్లించలేదని లక్ష్మి ఆరోపిస్తున్నారు. అయితే కొంత మొత్తం తిరిగి ఇచ్చానని, ఇంకా కొంత బాకీ ఉందని కిరణ్ రాయల్ తన వీడియోలో చెప్పినట్లు సమాచారం. డబ్బు కోసం లక్ష్మి ఒత్తిడి చేయగా, కిరణ్ ఆమెను బెదిరించారని కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. మొత్తం ఈ వ్యవహారం జనసేన కు తలనొప్పిగా మారింది.