Kiran kumar Reddy : బీజేపీలో ప‌ద‌విలేని కిర‌ణ్ కుమార్ రెడ్డి

ఉమ్మ‌డి ఏపీ మాజీ సీఎం కిర‌ణ్ కుమార్ రెడ్డి(Kiran kumar Reddy) బీజేపీ చీఫ్ కాబోతున్నారా?బీజేపీ అధిష్టానం ఎలాంటి బాధ్య‌త‌ల‌ను అప్ప‌గిస్తుంది?

  • Written By:
  • Publish Date - April 13, 2023 / 03:22 PM IST

ఉమ్మ‌డి ఏపీ మాజీ సీఎం కిర‌ణ్ కుమార్ రెడ్డి(Kiran kumar Reddy) బీజేపీ చీఫ్ కాబోతున్నారా? ఏం ఆశించి ఆయ‌న బీజేపీలో చేరారు? ఢిల్లీ బీజేపీ(Delhi BJP) అధిష్టానం ఆయ‌న‌కు ఎలాంటి బాధ్య‌త‌ల‌ను అప్ప‌గిస్తుంది? అనేవి ఇప్పుడు ఉత్ప‌న్నం అవుతోన్న ప్ర‌శ్న‌లు. వాస్త‌వంగా ఆయ‌న పీసీసీ ప‌ద‌వి ఇవ్వ‌లేద‌ని కాంగ్రెస్ పార్టీని వీడారు. ఆ ప‌ద‌విని ఆశించి భంగ‌ప‌డ్డారు. కాంగ్రెస్ పార్టీకి ప‌నికిరాని కిర‌ణ్ కుమార్ రెడ్డిని బీజేపీ ఆశ్ర‌యించింది. కానీ, ఏపీలో బీజేపీ బ‌ల‌ప‌డ‌డం అనేది ఇప్ప‌ట్లో జ‌ర‌గ‌ద‌ని రాజ‌కీయాలు ప‌రిచ‌యం ఉన్న ఎవ‌రైనా చెబుతారు.

ఉమ్మ‌డి ఏపీ మాజీ సీఎం కిర‌ణ్ కుమార్ రెడ్డి(Kiran kumar Reddy)

సామాజిక‌వ‌ర్గాల ప‌రంగా క‌మ్మ‌, రెడ్డి, కాపుల చుట్టూ ఏపీ రాజ‌కీయం తిరుగుతోంది. ఏపీ ఓటింగ్ కు కూడా సామాజిక‌వ‌ర్గాల ప‌రంగా జ‌రుగుతుంద‌ని అంచ‌నా వేస్తుంటారు. ఏ రాష్ట్రంలో లేనివిధంగా కులం ప్ర‌భావం ఏపీలో ఉంటుంద‌ని స‌ర్వ‌త్రా వినిపించే మాట‌. అందుకే, రెడ్డి సామాజిక‌వ‌ర్గం నుంచి బ‌ల‌మైన లీడ‌ర్ గా కిర‌ణ్ కుమార్ రెడ్డిని(Kiran Kumar Reddy) బీజేపీ గుర్తించింది. పైగా చంద్ర‌బాబు కుటుంబానికి తొలి నుంచి రాజ‌కీయ శ‌త్రువుగా కిర‌ణ్ కుమార్ రెడ్డి ఫ్యామిలీ ఉంది. అంతేకాదు, చిత్తూరు కేంద్రంగా చంద్ర‌బాబు, కిర‌ణ్ కుమార్ రెడ్డి తండ్రి మ‌ధ్య ద‌శాబ్దాలు రాజ‌క‌యం సీరియ‌స్ గా న‌డిచింది. అందుకే, టీడీపీ రాజ‌కీయానికి ధీటుగా బీజేపీ పావులు క‌దుపుతూ మాజీ సీఎంను అక్కున చేర్చుకుంద‌ని భావించ‌డానికి అవ‌కాశం ఉంది.

ఏపీ బీజేపీ ప‌గ్గాలు అప్ప‌గించే అవ‌కాశం

ప్ర‌స్తుతం బీజేపీ, జ‌న‌సేన పొత్తు ఉంది. ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు, జ‌న‌సేన చీఫ్ ప‌వ‌న్ క‌ల్యాణ్ ఇద్ద‌రూ కాపు సామాజిక‌వ‌ర్గంకు చెందిన వారే. అందుకే, బీజేపీ చీఫ్ గా వీర్రాజును మార్చేసి బ‌ల‌మైన క‌మ్మ‌, రెడ్డి సామాజిక‌వ‌ర్గాల్లో ఎవ‌రో ఒక‌రికి అప్ప‌గించాల‌ని ఢిల్లీ బీజేపీ ఆలోచ‌న‌గా ఉంద‌ని తెలుస్తోంది. ఆ కోణం నుంచి ప‌రిశీలిస్తే, కిర‌ణ్ కుమార్ రెడ్డికి (Kiran kumar Reddy) త్వ‌ర‌లోనే ఏపీ బీజేపీ ప‌గ్గాలు అప్ప‌గించే అవ‌కాశం ఉంది. లేదంటే, క‌మ్మ సామాజిక‌వ‌ర్గం, ఎన్టీఆర్ చ‌రిష్మాను క‌ల‌బోసిన రాజ‌కీయ‌వేత్త‌గా ఉన్న పురంధ‌రేశ్వ‌రికి ఆ ప‌ద‌విని క‌ట్ట‌బెట్టాల‌ని భావిస్తున్నార‌ట‌. వాళ్లిద్ద‌రిలో ఒక‌రికి ఏపీ బీజేపీ ప‌గ్గాలు అప్ప‌గిస్తే వ‌చ్చే ప‌రిణామాల‌ను బీజేపీ(Delhi BJP) అంచ‌నా వేసుకుంటోంది.

Also Read : BJP Approach High Court: బండి సంజయ్ పాదయాత్రకు నో పర్మిషన్.. కోర్టును ఆశ్రయించిన బీజేపీ

రాయ‌ల‌సీమ ప్రాంతానికి చెందిన లీడ‌ర్ గా కిర‌ణ్ కుమార్ రెడ్డి (Kirna Kumar Reddy) ఉన్నారు. గ‌తంలో ఉత్త‌రాంధ్ర‌కు చెందిన వాళ్లు ఎక్కువ కాలం బీజేపీ ఏపీ అధ్య‌క్షుడిగా కంభంపాటి హ‌రిబాబు సుదీర్ఘంగా ప‌నిచేశారు. ఆ త‌రువాత ఆంధ్ర‌కు చెందిన క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ అధ్యక్షునిగా ఉన్నారు. ప్ర‌స్తుతం గోదావ‌రి జిల్లాల‌కు చెందిన వీర్రాజు ప‌నిచేస్తున్నారు. ఈసారి రాయ‌ల‌సీమ ప్రాంతానికి చెందిన లీడ‌ర్ కు ఆ ప‌ద‌విని అప్ప‌గించాల‌ని బీజేపీ ఢిల్లీ(Delhi BjP) అగ్ర‌నేత‌లు భావిస్తున్నారు. కానీ, కిర‌ణ్ కుమార్ రెడ్డికి అవ‌కాశం ఇచ్చేలా ఆలోచ‌న చేయ‌క‌పోవ‌చ్చు. ఆర్ ఎస్ ఎస్ నేప‌థ్యం ఉన్న వాళ్ల‌ను అధ్య‌క్షునిగా చేసే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది. అందుకే రాయ‌ల‌సీమ‌కు చెందిన సురేష్ రెడ్డికి ఆ ప‌ద‌వి ద‌క్క‌వ‌చ్చ‌ని స‌మాచారం. ఫ‌లితంగా కిర‌ణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ లో మాదిరిగా సైడ్ అయ్యే ఛాన్స్ ఉంది.

Also Read : AP BJP : రెండోసారి బీజేపీ ఏపీ చీఫ్ గా సోము, జ‌న‌సేన‌లోకి `క‌న్నా`? బీజేపీ ఖాళీ!