Site icon HashtagU Telugu

YS Sharmila : షర్మిల కుమారుడి మ్యారేజ్ రిసెప్షన్.. హాజరైన ప్రముఖులు వీరే

Ys Sharmila

Ys Sharmila

YS Sharmila : ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కుమారుడు రాజా రెడ్డి మ్యారేజ్ ఇటీవల రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో జరగగా.. తాజాగా శనివారం రాత్రి శంషాబాద్‌లోని ఓ హోటల్‌లో  రిసెప్షన్ గ్రాండ్‌గా జరిగింది.  జోధ్‌పూర్‌లో జరిగిన వివాహానికి  గైర్హాజరైన షర్మిల(YS Sharmila) సోదరుడు, ఏపీ సీఎం వైఎస్ జగన్.. మ్యారేజ్ రిసెప్షన్‌కు సైతం హాజరుకాకపోవడం హాట్ టాపిక్ అవుతోంది. అంతకుముందు గత నెలలో హైదరాబాద్‌లో జరిగిన రాజా రెడ్డి, ప్రియల నిశ్చితార్థ వేడుకకు ఏపీ సీఎం జగన్ సతీసమేతంగా హాజరయ్యారు. కీలకమైన వివాహం, రిసెప్షన్‌కు మాత్రం జగన్ దూరంగా ఉండిపోయారు.

రిసెప్షన్‌కు హాజరైన ప్రముఖుల్లో..

ఇక రిసెప్షన్‌కు హాజరైన ప్రముఖుల్లో కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఏఐసీసీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణు గోపాల్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్ ఇంఛార్జ్ దీపాదాస్ మున్షీ, కేవీపీ, తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తదితరులు ఉన్నారు.  వీరితో పాటు రాజకీయ, వ్యాపార, క్రీడా, సినీ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు మ్యారేజ్ రిసెప్షన్‌కు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.

We’re now on WhatsApp. Click to Join

వైఎస్ విజయమ్మ ఇంటి పెద్దగా..

ఫిబ్రవరి 17న వైఎస్ షర్మిల, బ్రదర్ అనిల్‌ల కుమారుడు రాజా రెడ్డి పెళ్లి జరిగింది. రాజస్థాన్ లోని జోధ్ పూర్‌లో ఉన్న ఓ  ప్యాలెస్‌లో వైఎస్ రాజారెడ్డి , అట్లూరి ప్రియల వివాహం వైభవంగా జరిగింది. రెండు కుటుంబాల సభ్యుల సమక్షంలో రాజారెడ్డి, ప్రియ వివాహ బంధంతో ఒక్కటయ్యారు. వైఎస్ విజయమ్మ ఇంటి పెద్దగా మనవడి వివాహం జరిపించారు. మరుసటిరోజు క్రైస్తవ సాంప్రదాయంలోనూ రాజారెడ్డి, ప్రియల వివాహం జరిగింది. దివంగత నేత వైఎస్సార్ ఫొటో సమక్షంలో వివాహ వేడుక అనంతరం ఇరు కుటుంబసభ్యులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.

Also Read : PM Modi: ప్రపంచంలోనే అతిపెద్ద ధాన్యం నిల్వ పథకం ప్రారంభించిన ప్ర‌ధాని మోదీ.!