Site icon HashtagU Telugu

Ambati Rambabu : కమ్మ సామాజిక వర్గంపై మంత్రి అంబటి ఆగ్రహం..ఉగ్రవాదులు అంటూ వ్యాఖ్యలు

Ambati Rambabu Tweet

Ambati Rambabu Tweet

వైసీపీ మంత్రి అంబటి రాంబాబు (Ambati Rambabu) కమ్మ సామాజిక వర్గంపై నిప్పులు చెరిగారు. కొంతమంది ఉగ్రవాదులుగా మారారంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు. రీసెంట్ గా అంబటి..ఖమ్మంలో(Khammam) ఓ వేడుకకు హాజరుకాగా..అక్కడ టీడీపీ – జనసేన (TDP -Janasena) శ్రేణులు అడ్డుకొని ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ..చంద్రబాబు కు సంఘీభావం తెలిపారు. ఇంకొంతమంది బండ బూతులు తిట్టారు. ఈ ఘటన పట్ల అంబటి స్పందించారు.

We’re now on WhatsApp. Click to Join.

కమ్మ సామాజికవర్గానికి చెందిన వారే తనపై హత్యాయత్నానికి పాల్పడ్డారని ఆరోపించారు. అంతేకాదు ఆ సామాజికవర్గంలో కొందరు ఉగ్రవాదులుగా మారారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిశ్చితార్ధానికి వెళ్తే తనపై చాలా బలంగా దాడి చేశారని మండిపడ్డారు. హైసెక్యూరిటీ ఉండటంతో ఎలాంటి ఇబ్బంది లేకుండా తాను బయటపడ్డానని తెలిపారు. ఖమ్మం ఘటనను చిన్న విషయంగా చూడొద్దన్నారు. తనపై దాడికి యత్నించిన వారిలో తొమ్మిదిమందిని పోలీసులు గుర్తించారని, ఇప్పటివరకూ ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారని తెలిపారు. నిందితులంతా ఒకే సామాజిక వర్గానికి చెందిన వారేనని చెప్పారు. భౌతిక దాడులు చేసిన రాజకీయ పక్షంగాని, సామాజికవర్గం గాని పైకి వచ్చిన దాఖలు లేవన్నారు. బతికి బట్ట కట్టిన సందర్భాలు లేవని హెచ్చరించారు.

Read Also : Kotha Prabhakar Reddy : BRS ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ఫై కత్తితో దాడి