Kadapa : క‌డ‌పలో `ఖ‌మ్మం` ఎఫెక్ట్‌! క‌మ‌లాపురంలో బీఆర్ ఎస్ బాట‌న జ‌గ‌న్ !

చంద్ర‌బాబు ఖ‌మ్మం స‌భ‌ను కోణం నుంచి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి చూపించారు.

  • Written By:
  • Updated On - December 23, 2022 / 11:02 PM IST

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్య‌క్షుడు చంద్ర‌బాబు ఖ‌మ్మం స‌భ‌ను విచిత్ర రాజ‌కీయం కోణం నుంచి ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి(Jagan) చూపించారు. ఆయ‌న క‌డ‌ప(Kadapa) జిల్లా ప‌ర్య‌ట‌న‌లో భాగంగా క‌మ‌లాపురంలో ప్ర‌సంగించారు. ఆ సంద‌ర్భంగా ప‌రోక్షంగా ఖ‌మ్మం స‌భ‌ను ప్ర‌స్తావిస్తూ చంద్ర‌బాబు మాదిరిగా ఈ రాష్ట్రం కాక‌పోతే ఆ రాష్ట్రానికి వెళ్లే లీడ‌ర్ ను కాద‌ని వ్యంగ్యాస్త్రాల‌ను సంధించారు. ఏపీలో అధికారంలోకి రాలేమ‌న్న సందేహంతో తెలంగాణ వైపు చంద్ర‌బాబు చూస్తున్నార‌ని జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి వ్యంగ్యాస్త్రాల‌ను సంధించారు. ఎప్పుడూ ఏపీ కోసం అక్క‌డ ప్ర‌జ‌ల కోసం త‌పిస్తాన‌ని ఆయ‌న‌ చిత్త‌శుద్ధిని ప్ర‌ద‌ర్శించారు. ద‌త్త‌పుత్రుడు ప‌వ‌న్, చంద్ర‌బాబు మాదిరిగా ఇత‌ర రాష్ట్రాల నుంచి వ‌చ్చి ఏపీ రాజ‌కీయాన్ని చేయ‌న‌నే విష‌యాన్ని గుర్తించుకోవాల‌ని జ‌గ‌న్(Jagan) చెప్ప‌డం గ‌మ‌నార్హం.

క‌డ‌ప(Kadapa) జిల్లా ప‌ర్య‌ట‌న‌లో..

వాస్త‌వంగా ఏపీ రాజ‌కీయాలు చేసే ప్ర‌ధాన పార్టీల చీఫ్ ల‌తో పాటు మంత్రులు కూడా హైద‌రాబాద్ లో నివాసాల‌ను క‌లిగి ఉన్నారు. ప్ర‌త్యేకించి లోట‌స్ పాండ్ ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి(Jagan) ప్ర‌స్తుత విడిది నివాసం. ఒక‌ప్పుడు అక్క‌డ నుంచే ఏపీ రాజ‌కీయాల‌ను ప‌దేళ్ల పాటు న‌డిపారు. ఆయ‌న ప్ర‌తిప‌క్ష‌నేత‌గా ఉన్న‌ప్పుడు హైద‌రాబాద్ నివాసాన్ని వీడ‌లేదు. సీఎం అయిన త‌రువాత మాత్ర‌మే హైద‌రాబాద్ ను వ‌దిలిపెట్టి తాడేప‌ల్లికి షిఫ్ట్ అయ్యారు. మ‌ళ్లీ ఛాన్స్ కోసం ఏపీ ప్ర‌జ‌ల‌ను అభ్య‌ర్థిస్తున్నారు. ఒక వేళ మ‌ళ్లీ సీఎం కాలేక‌పోతే, తాడేప‌ల్లిలోనే ఉంటాన‌ని మాత్రం చెప్ప‌లేపోతున్నారు. గెలుపు కో్సం దేవుడి ద‌య‌, ప్ర‌జ‌ల‌ను న‌మ్ముకున్నాన‌ని చెబుతోన్న ఆయ‌న ఎక్క‌డున్నా ఐదు కోట్ల ఆంధ్రుల కోసం ప‌నిచేస్తాన‌ని చెబుతున్నారు. అంటే, ఓడిపోయిన వెంట‌నే తాడేప‌ల్లిని ఖాళీ చేసి తిరిగి హైద‌రాబాద్ కు షిఫ్ట్ కావ‌డం ఖాయమ‌ని ఆయ‌న మాట‌ల్లోని ఆంత‌ర్యం.

ప్ర‌స్తుతం చంద్ర‌బాబునాయుడు హైద‌రాబాద్ నివాసంలోనే ఉంటున్నారు. ఆయ‌నకు ఏపీలోని ఉండ‌వ‌ల్లి వ‌ద్ద మ‌రో హౌస్ ఉంది. అధికారంలో ఉన్న‌ప్పుడు అక్క‌డ నుంచే కార్య‌క‌లాపాల‌ను న‌డిపారు. ప్ర‌తిప‌క్షంలోకి వ‌చ్చిన త‌రువాత ఎక్కువ‌గా హైద‌రాబాద్ నుంచే ఏపీకి వెళ్లొస్తున్నారు. ఇక జ‌న‌సేనాని ప‌వ‌న్ హైద‌రాబాద్ లోనే ఉంటారు. షూటింగ్ గ్యాప్ లు ఉన్న‌ప్పుడు మంగ‌ళ‌గిరి పార్టీ ఆఫీస్ కు వెళ్లి రాజ‌కీయాలు చేస్తారు. ముఖ్య‌మంత్రి అయ్యే వ‌ర‌కు ఆయ‌న కూడా ప‌ర్మినెంట్ గా ఏపీలో నివాసం ఉండ‌రు. అంటే, ఎవ‌రైనా అధికారం ఉంటే ఏపీలో ఉంటారు లేదంటే హైద‌రాబాద్ కు షిఫ్ట్ అవుతార‌ని అంద‌రికీ తెలిసిందే. కానీ, జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి మాత్రం క‌మ‌లాపురం కేంద్రంగా ఆ సూత్రాన్ని కేవ‌లం చంద్ర‌బాబు, జ‌న‌సేనానికి మాత్ర‌మే వ‌ర్తింప చేస్తూ రాజకీయాన్ని ర‌క్తిక‌ట్టించాల‌ని చూస్తున్నారు.

స‌హోద‌ర పార్టీగా ఉన్న వైసీపీ

ఇక ఖ‌మ్మంలో జ‌రిగిన చంద్ర‌బాబు స‌భ సూప‌ర్ హిట్ అయిన విష‌యం అందిరికీ విదిత‌మే. దాని ప్ర‌కంప‌న‌లు ఇప్ప‌టి వ‌ర‌కు త‌గ్గ‌లేదు. తెలంగాణ‌లోని బీఆర్ఎస్ పార్టీకి నిద్ర‌లేకుండా చేస్తోంది. రోజుకో ర‌కంగా చంద్ర‌బాబు మీద రాజ‌కీయ దాడి చేయ‌డానికి మంత్రులు మీడియా ముందుకు వ‌స్తున్నారు. స‌హోద‌ర పార్టీగా ఉన్న వైసీపీ మాత్రం చంద్ర‌బాబు స‌భ గురించి ఇప్ప‌టి వ‌ర‌కు పెద్ద‌గా స్పంద‌న లేదు. కానీ, క‌డ‌ప జిల్లా మ‌లాపురం స‌భ‌లో మాత్రం రాష్ట్రాన్ని విడిచిపెట్టి చంద్ర‌బాబు వెళ‌తార‌ని జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప‌రోక్షంగా రాజకీయ అస్త్రాన్ని సంధించారు. ఏపీలో చెల్లని లీడ‌ర్ తెలంగాణ‌కు వ‌చ్చార‌ని బీఆర్ఎస్ ఆరోపిస్తుంటే, ఏపీలో చెల్ల‌డ‌ని భావిస్తూ చంద్ర‌బాబు తెలంగాణ‌కు వెళుతున్నాడ‌ని వైసీపీ దుమ్మెత్తిపోస్తోంది. అటు బీఆర్ఎస్ ఇటు వైసీపీ చంద్ర‌బాబు ఖ‌మ్మం స‌భ‌కు వ‌చ్చిన పాజిటివ్ ను త‌ట్టుకోలేక గేమాడ‌డం ప్రారంభించాయి. అందుకు, క‌మ‌లాపురం స‌భ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి కేంద్రం అయింది. మొత్తం మీద ఖ‌మ్మం స‌భ‌ను హీట్ క‌డ‌ప(Kadapha) జిల్లా క‌మ‌లాపురం వ‌ర‌కు త‌గిలింద‌న్న‌మాట‌.

Jagan Tabs: జగన్ ‘డిజిటల్’ కానుక.. విద్యార్థులకు 5.18 లక్షల ట్యాబ్స్ పంపిణీ!