Sharmilas Son Wedding : వైఎస్ షర్మిల కొడుకు పెళ్లిపై కీలక అప్డేట్

Sharmilas Son Wedding : వైఎస్సార్‌టీపీ అధినేత్రి వైఎస్‌ షర్మిల కుమారుడు రాజారెడ్డి ప్రేమ వివాహం చేసుకోబోతున్నారే వార్త గత కొంత కాలంగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే.

Published By: HashtagU Telugu Desk
Sharmilas Son Wedding

Sharmilas Son Wedding

Sharmilas Son Wedding : న్యూ ఇయర్‌లో మొదటి రోజున వైఎస్సార్‌టీపీ అధినేత్రి వైఎస్‌ షర్మిల గుడ్ న్యూస్ చెప్పారు. ఈనెల 18న తన కుమారుడు రాజారెడ్డికి,  అమెరికాలో పుట్టి పెరిగిన తెలుగమ్మాయి అట్లూరి ప్రియతో నిశ్చితార్థం ఉంటుందని ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. ఫిబ్రవరి 17న పెళ్లి ముహూర్తాన్ని ఖరారు చేసినట్లు చెప్పారు. రేపు (జనవరి 2) కుటుంబ సమేతంగా కాబోయే వధూవరులతో కలిసి ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్‌ని సందర్శించి తొలి ఆహ్వాన పత్రిక ఘాట్ వద్ద ఉంచి, వైఎస్ఆర్ ఆశీస్సులు తీసుకుంటామన్నారు. ఏపీ సీఎం జగన్, వైఎస్ షర్మిల మధ్య విభేదాలు నెలకొన్నట్లు గత కొంత కాలంగా ప్రచారం(Sharmilas Son Wedding) జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఈ కార్యక్రమానికి సీఎం జగన్ వస్తారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది.

We’re now on WhatsApp. Click to Join.

  • రాజారెడ్డి అమెరికాలోని డ‌ల్లాస్ యూనివ‌ర్సిటీలో బ్యాచిల‌ర్ అండ్ బిజినెస్ అడ్మినిస్ట్రేష‌న్ (బీబీఏ) కోర్సును పూర్తి చేశారు.
  • ఇటీవల డ‌ల్లాస్ యూనివ‌ర్సిటీలో జరిగిన కాన్వొకేషన్ కార్యక్రమంలో పాల్గొనడానికి వైఎస్ షర్మిల, అనిల్ కుమార్ దంపతులు అమెరికాకు వెళ్లిన టైంలో దిగిన ఫోటోలు వైరల్ అయ్యాయి.
  • ఇటీవల అమెరికాలో ప్రియకు షర్మిల తల్లి విజయమ్మ చీర పెట్టిన ఫొటో నెట్టింట్లో వైరల్ అయింది. అయితే తాజాగా వైఎస్‌ షర్మిల ప్రకటనతో  రాజారెడ్డి,  అట్లూరి ప్రియల ప్రేమ వివాహంపై క్లారిటీ వచ్చింది.
  • ప్రియా అట్లూరి కూడా అమెరికాలోని పేరున్న విశ్వవిద్యాలయంలో మాస్టర్స్‌ పూర్తి చేశారు. ప్రస్తుతం ఓ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. ఆమె దగ్గరి బంధువులను కూడా నిశ్చితార్దానికి ఆహ్వానిస్తున్నట్లు తెలుస్తోంది.

Also Read: 16 New Years – 1 Day : అక్కడ ఒక్కరోజే 16సార్లు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్.. ఎందుకు ?

  Last Updated: 01 Jan 2024, 01:20 PM IST