Site icon HashtagU Telugu

Vijayawada : అర్ధరాత్రి అరకట్టపై పీసీబీ, మైనింగ్ పత్రాల కాల్చివేత ..

Ap Pollution Control Board

Ap Pollution Control Board

ఏపీ(AP)లో ప్రభుత్వం మారడంతో గత ప్రభుత్వ అక్రమాలను బయటకు తీయడం మొదలుపెట్టారు. ఇప్పటికే సీఎం చంద్రబాబు (Chandrababu) పోలవరం, అమరావతి లపై శ్వేత పత్రాలను విడుదల చేసి..జగన్ ఎంత నష్టం చేసారో..వంటివి తెలియజేయగా..మిగతా శాఖల నేతలు సైతం భారీగా అక్రమాలు, డబ్బు దోచుకున్నట్లు తేలుతుంది. అధికారులతో సమీక్షలు జరిపి లెక్కలు బయటకు తీస్తుండడం తో ఎన్ని వేలకోట్లు దోచుకున్నారనేది బయట పడుతుంది. ఈ క్రమంలో పలు ముఖ్యమంత్రి పత్రాలు, హర్డ్ డిస్క్ లు కాల్చివేయడం సంచలనంగా మారింది.

We’re now on WhatsApp. Click to Join.

బుధువారం రాత్రి విజయవాడ అరకట్ట ఫై ఏపీ కాలుష్య నియంత్రణ మండలి, ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థలకు (AP Pollution Control Board and Mining Department) చెందిన బస్తాల కొద్దీ పత్రాలను కొందరు వ్యక్తులు తగలబెట్టారు. ఈ పత్రాల్లో కొన్ని సీఎంఓకు చెందిన దస్త్రాలు, కాలుష్య నియంత్రణ మండలికి చెందిన హార్డ్ డిస్కులు ఉన్నట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ పత్రాలపై మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కాలుష్య నియంత్రణ మండలి మాజీ ఛైర్మన్ సమీర్ శర్మ చిత్రాలు ఉండడం చూసిన ఓ టీడీపీ కార్యకర్త పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్, అధికార నేతలకు సమాచారం అందించారు. ఈ పత్రాలు కాల్చేసిన తర్వాత దుండగులు కారుతో యనమలకుదురు వైపు పరారవుతున్నట్లు గమనించిన టీడీపీ నేతలు ఆ వాహనాన్ని అడ్డుకుని, పోలీసులకు సమాచారం అందించారు. దీంతో స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కారులో ఉన్న ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం వీరిని విచారిస్తున్నారు..ఈ పత్రాలు ఎక్కడి నుండి తీసుకొచ్చారు..? ఎవర్ని తగలబెట్టమన్నారు..? ఆ పత్రాల్లో ఏమున్నాయి..? వంటి వివరాలను సేకరిస్తున్నారు.

Read Also : Hyundai : ఈ నెలలో హ్యుందాయ్ ఆల్-ఎలక్ట్రిక్ కాస్పర్ SUV ఉత్పత్తి ప్రారంభం