Site icon HashtagU Telugu

AP : ఏపిలో వేసవి సెలవుల పై విద్యాశాఖ కీలక ఆదేశాలు

Key Directions Of Education

Key directions of education department on summer holidays in AP

AP: ఏపిలో ఈరోజు పదోతరగతి పరీక్ష ఫలితాలు విడుదలైన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు పాఠశాలలకు వేసవి సెలవుల(summer holidays)పై విద్యాశాఖ(Education Department) కీలక ఆదేశాలు జారీ చేసింది. పాఠశాల విద్యార్థులకు ఈనెల 24 నుంచి జూన్‌ 11వ తేదీ వరకూ వేసవి సెలవులు ఇస్తున్నామని పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది.

We’re now on WhatsApp. Click to Join.

ఈ సందర్భంగానే వేసవి సెలవులను దృష్టిలో ఉంచుకుని ఏపీకి చెందిన విద్యాశాఖ మరో కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థుల కోసం మరో కొత్త కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారు. ఇప్పుడు ఈ నిర్ణయం ఆసక్తి కరంగా మారుతోంది.

Read Also:Sabari: శబరి పాటలు షురూ.. బిడ్డపై తల్లి ప్రేమను చాటేలా ‘నా చెయ్యి పట్టుకోవే’ సాంగ్ రిలీజ్

ఏపీలోని అన్ని పాఠశాలలకు ఈ నెల 24 నుంచి వేసవి సెలవులు ప్రారంభం కానున్నాయి. ఆంధ్రప్రదేశ్‌ విద్యాశాఖ విద్యార్థులు వేసవి సెలవులను సద్వినియోగం చేసుకునేందుకు కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ మేరకు పాఠశాలలకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమం ‘హాలిడే ఫన్‌ 2024’ పేరుతో ప్రారంభించబడింది. ఈ కార్యక్రమం కింద, విద్యార్థులకు కోచింగ్‌ క్యాంపులు నిర్వహించడానికి పిఒఇలను కేటాయించారు. ఉపాధ్యాయులు కూడా విద్యార్థుల్లో పఠనాసక్తిని పెంచాలన్నారు. ‘వి లవ్‌ రీడింగ్‌’ పేరుతో పోటీ నిర్వహించాలని ప్రధానోపాధ్యాయులు సూచించారు.

Read Also:Keera Dosakaya Raitha : ఎండాకాలంలో కీరదోసకాయ పెరుగు పచ్చడి.. ఎలా చేయాలంటే.. హెల్త్‌కి ఎంత మంచిదో తెలుసా?

సెలవుల్లో సరదా కార్యక్రమాల అమలుకు సంబంధించి పాఠశాల విద్యాశాఖాధికారి సురేశ్‌కుమార్‌ ఇటీవల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా ప్రతి తరగతిలో అమలు చేయాల్సిన అంశాలకు సంబంధించి మార్గదర్శకాలను విడుదల చేశారు. సరదా కార్యక్రమంలో భాగంగా, సెలవుల్లో క్రీడలు, వృత్తి నైపుణ్యం, సృజనాత్మక కళలు, విద్యార్థుల దాచిన సామర్థ్యాలపై దృష్టి పెట్టాలని సిఫార్సు చేశారు. విద్యా సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, స్థానిక సంఘాలు కూడా ఇందులో భాగస్వాములు కావాలని ప్రభుత్వం సూచిస్తోంది.