Site icon HashtagU Telugu

AP Liquor Scam : మద్యం స్కాంలో కీలక పరిణామం.. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి బిగ్ షాక్..!

Chevireddy Bhaskar Reddy

Chevireddy Bhaskar Reddy

ఏపీ మద్యం కుంభకోణంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుటుంబం ఆస్తుల జప్తునకు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఆయన తనయుడు మోహిత్ రెడ్డి మద్యం కుంభకోణంలో నిందితులుగా ఉన్న సంగతి తెలిసిందే. ఏపీ లిక్కర్ స్కామ్‌లో నిందితుల ఆస్తుల జప్తు చేపడుతున్న ప్రత్యేక దర్యాప్తు బృందం.. తాజాగా చెవిరెడ్డి కుటుంబ సభ్యుల ఆస్తుల జప్తునకు ప్రభుత్వం అనుమతి కోరింది. ఈ నేపథ్యంలోనే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, హర్షిత్ రెడ్డి పేరిట ఉన్న ఆస్తులను జప్తు చేసేందుకు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అలాగే కేవీఎస్ ఇన్ ఫ్రా ఎండీ చెవిరెడ్డి లక్ష్మి పేరు మీద ఉన్న ఆస్తుల జప్తునకు కూడా ఆదేశాలు జారీ చేసింది.

వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కి బిగ్ షాక్ తగిలింది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుటుంబ సభ్యుల ఆస్తుల జప్తునకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నిందితుడిగా ఉన్నారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో పాటుగా ఆయన తనయుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి కూడా ఏపీ లిక్కర్ స్కామ్‌లో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. మరోవైపు మద్యం కుంభకోణంపై విచారణ జరుపుతున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) నిందితుల ఆస్తులను జప్తు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుటుంబసభ్యుల ఆస్తుల జప్తునకు సిట్ అనుమతి కోరగా.. ఏపీ ప్రభుత్వం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మోహిత్ రెడ్డి, హర్షిత్ రెడ్డి, చెవిరెడ్డి లక్ష్మి పేరిట ఉన్న ఆస్తులను జప్తు చేయాలని ఆదేశాలు జారీ చేసింది.

 

Exit mobile version