మాజీ సీఎం జగన్ (Jagan) కు చెందిన సరస్వతి పవర్ ఇండస్ట్రీస్ లోని అసైన్డ్ భూములను (Saraswati Lands) చంద్రబాబు ప్రభుత్వం (AP Govt) వెనక్కు తీసుకుంది. కొద్ది రోజుల క్రితం డిప్యూటీ సీఎం పవన్ (Pawan Kalyan) ఈ భూములను పరిశీలించారు. జగన్ భూములను చెరబట్టారని ఆరోపిం చారు. పల్నాడు జిల్లా మాచవరం తహశీల్దార్ ఎం.క్షమారాణి (Tehsildar M. Kshamarani) ఈ విషయాన్ని ప్రకటించారు. ఈ మేరకు ప్రభుత్వం 17.69 ఎకరాలు భూములను స్వాధీనం చేసుకోవడానికి ఉత్తర్వులు జారీ చేసింది. ఈ భూముల్లో 13.80 ఎకరాలు వేమవరం మండలం పరిధిలో, 3.89 ఎకరాలు పిన్నెల్లి మండలంలో ఉన్నాయి. ఈ భూములను ప్రభుత్వ రికార్డుల్లో తిరిగి చేర్చుకోవాలని నిర్ణయించారు. సరస్వతి పవర్ ఇండస్ట్రీస్‌కు చెందిన భూముల పట్ల ప్రభుత్వ నియంత్రణను పెంచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది.
రీసెంట్ గా సరస్వతి పవర్ కంపెనీకి వేమవరం, చెన్నాయపాలెం, పిన్నెల్లి గ్రామాల పరిధిలో దాదాపు 2 వేల ఎకరాల భూములు కేటాయించినట్లు తెలుస్తోంది. ఈ భూములను తిరిగి ప్రభుత్వ పరిధిలోకి తీసుకురావడం కోసం ఈ నిర్ణయం తీసుకోబడింది. ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నది భూములను వినియోగాన్ని సరిగ్గా నిర్వహించడం కోసమే తప్ప మరోటికాదు. ఈ నిర్ణయం గ్రామాల అభివృద్ధికి దోహదపడుతుందని, భూముల న్యాయమైన వినియోగం కోసం మరిన్ని చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది.
పల్నాడులో జగన్ సరస్వతి పవర్ ఇండస్ట్రీస్ కోసం భూములు తీసుకున్నారు. వైఎస్ సీఎంగా ఉన్న సమయంలోనూ ఈ భూ కేటాయింపులు జరిగాయి. దీని పైన అప్పట్లోనే వివాదం చోటు చేసుకుంది. అయితే, ఆ తరువాత జగన్ ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. జగన్ -షర్మిల వివాదం లోనూ సరస్వతి పవర్ అంశం పైన భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. కాగా, కొద్ది రోజుల క్రితం డిప్యూటీ సీఎం పవన్ పల్నాడులో సరస్వతి పవర్ కు కేటాయించిన భూములను పరిశీలించారు. ఆ సమయంలోనే 1324. 93 ఎకరాల భూమిని చెరబట్టారని ఆరోపించడం జరిగింది.
Read Also : Jamili Elections : జమిలి ఎన్నికల బిల్లుకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం