Site icon HashtagU Telugu

Konda Surekha Comments : సురేఖ – సమంత వ్యవహారంలోకి కేతిరెడ్డి

Kethireddy Surekha

Kethireddy Surekha

సమంత , నాగార్జున ఫై మంత్రి కొండా సురేఖ చేసిన కామెంట్స్ కాకరేపుతున్న సంగతి తెలిసిందే. దీనిపై టాలీవుడ్ ఇండస్ట్రీ తో పాటు రాజకీయ పార్టీల నేతలు సైతం కొండా సురేఖ పై ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. అటు తనపై చేసిన ఆరోపణలకు నాగార్జున నాంపల్లి కోర్ట్ లో సురేఖ పై పరువు నష్టం దావా సైతం వేశారు. దీనిపై కోర్ట్ వాయిదా వేసింది. ఇదిలా ఉంటె ఈ ఇష్యూ పై ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి (Kethireddy Venkatarami Reddy) స్పందించారు.

కొండా సురేఖ వ్యాఖ్యలపై హీరో నాగార్జున(Hero Nagarjuna) చేసిన ట్వీట్‌ను ఆయన కోట్ చేసి ట్వీట్‌ పోస్ట్ చేశారు. ప్రజలు రాజకీయాలంటే ఒక చులకన భావంతో చూస్తున్నారని, ఉన్నతమైన పదవిలో ఉన్నవాళ్లు హుందాగా ప్రవర్తించాలని సూచించారు. ఎవరిపై పడితే వారిపై అసభ్యకర వ్యాఖ్యలు చేయడం మంచిదికాదన్నారు. రాజకీయాల కోసం కుటుంబం, వ్యక్తిగత విషయాలను వాడుకోవడం ఒక నీచమైన చర్య అని కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి పేర్కొన్నారు.

ఇటు బీజేపీ మహిళా మోర్చా జాతీయ అధ్యక్షురాలు వనతీ శ్రీనివాసన్ తీవ్రంగా ఖండించారు. రాష్ట్ర మంత్రిగా ఉన్న ఆమె ఇలాంటి వ్యాఖ్యలు చేయడం బాధాకరమని, మరొకరి కుటుంబం గురించి మాట్లాడడం కచ్చితంగా తప్పని వనతీ అన్నారు. రాజకీయ విమర్శల్లోకి ఇతరులను లాగడం సరికాదని, ఇలాంటి వ్యాఖ్యలు ఓ మహిళా మంత్రి నుంచి రావడం బాధకలిగించిందని అన్నారు.

Read Also : TGPSC Group-1 : గ్రూప్‌-1 నోటిఫికేషన్‌పై హైకోర్టులో తీర్పు రిజర్వు