Kethamreddy Vinod Reddy Resign: జనసేన పార్టీకి కేతం రెడ్డి వినోద్ రెడ్డి రాజీనామా..ఎన్నికల టైంకు పవన్ ..మనోహర్ లు మాత్రమేనా..?

నెల్లూరు జిల్లాకు చెందిన జనసేన కీలక నేత కేతం రెడ్డి వినోద్ రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. రేపు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సమక్షంలో వైసీపీలో చేరనున్నట్లు ప్రకటించారు

  • Written By:
  • Publish Date - October 12, 2023 / 01:52 PM IST

మరో ఐదు , ఆరు నెలల్లో ఏపీలో ఎన్నికలు రాబోతుండగా..జనసేన పార్టీ (Janasena ) కి వరుస షాకులు తగులుతున్నాయి. ముఖ్యంగా టీడీపీ (TDP) తో పొత్తు పెట్టుకున్న దగ్గరి నుండి చాలామంది జనసేన నేతలు సైలెంట్ అయ్యారు. ఇక ఇప్పుడు వరుస పెట్టి పార్టీ కి రాజీనామా చేస్తున్నారు. మొన్నటి వరకు జనసేన కు సపోర్ట్ చేసిన నేతలంతా , క్రియాశీలక వ్యక్తులు వరుసగా పార్టీ నుండి బయటకు వస్తుండడం , సైలెంట్ అవుతుండడం తో ఎన్నికల సమయం నాటికీ జనసేన పార్టీ లో పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) , నాదెండ్ల మనోహర్ (Nadendla Manohar) మాత్రమే ఉంటరేమో అంటూ వైసీపీ (YCP) సెటైర్లు వేయడం స్టార్ట్ చేసింది.

ఏపీలో రాబోయేది టీడీపీ – జనసేన ల సంకీర్ణ ప్రభుత్వమే అని..పవన్ చెపుతుంటే..ఈలోపే జనసేన పార్టీకి వరుసగా ఎదురు దెబ్బలు తప్పడంలేదు. రీసెంట్ గా పవన్ కళ్యాణ్ కృష్ణా జిల్లాలో నాల్గో విడత వారాహి విజయ యాత్రను జిల్లాలో విజయవంతం చేశారు. అయితే ఇదే సమయంలో వరుస రాజీనామాలు పార్టీకి ఇబ్బందిగా మారాయి. కొన్ని రోజుల క్రితం వివిధ కారణాలతో కల్యాణ్ దిలీప్ సుంకర్ (Kalyan Dileep Sunkara) పార్టీ నుంచి బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. నిన్నటికి నిన్న పిఠాపురం జనసేన ఇన్ ఛార్జీ మాకినీడి శేషు కుమారి (Makineedi Seshu Kumari) రాజీనామా చేశారు. ఈ దెబ్బ నుంచి కోలుకోక ముందే జనసేన పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలిగింది. నెల్లూరు జిల్లాకు చెందిన జనసేన కీలక నేత కేతం రెడ్డి వినోద్ రెడ్డి (Kethamreddy Vinod Reddy) ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.

రేపు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి (YCP MP Vijaya Sai Reddy) సమక్షంలో వైసీపీలో చేరబోతున్నారు. 2019 ఎన్నికల్లో నెల్లూరు అర్బన్ నియోజకవర్గం నుంచి జనసేన అభ్యర్థిగా పోటీ చేసిన వినోద్ రెడ్డి ఓడిపోయారు. ఆ తరువాత కూడా పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ వస్తున్నారు. అయితే కొంతకాలం నుంచి తనను పార్టీ కార్యక్రమాలకు దూరంగా పెడుతున్నారని కేతంరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఈసారి ఎలాగైనా గెలిచి తీరాలని పట్టుదలతో ఇంటికి వెళ్లి ప్రచారం చేస్తూ వచ్చినప్పటికీ..ఇప్పుడు ఆయన్ను కాదని టీడీపీ నేత నారాయణకు టికెట్ ఖరారు చేయడంతో మనస్థాపానికి గురై పార్టీ కి రాజీనామా చేసారు. ఈ మేరకు ఆయన అధికారిక లేఖ ను రిలీజ్ చేసారు.

ఆ లేఖలో.. యువతకు ప్రాధాన్యత కల్పిస్తానన్న జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ప్రసంగాల పట్ల ఆకర్షితుడినై తాను జనసేన పార్టీలో చేరానని తెలిపారు. పార్టీలో చేరిన నాటి నుండి తాను ఒక నిబద్ధత గల జనసైనికునిగా పనిచేస్తూ పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్ళానని వినోద్ రెడ్డి తెలిపారు. తన పట్టుదల గుర్తించి పవన్ కళ్యాణ్ గారు 2019 ఎన్నికల్లో నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసే అవకాశాన్ని కల్పించారని పేర్కొన్నారు. ఆ సమయంలో ఓడిపోయినా “కాబోయే సీఎం పవన్ కళ్యాణ్” అనే సింగిల్ పాయింట్ ఎజెండాతో తాను 316 రోజుల పాటు నా నియోజకవర్గంలో ఒక్క ఇల్లు కూడా మిస్ కాకుండా “పవనన్న ప్రజాబాట” చేశానని తెలిపారు. అయితే నేడు మారిన పరిస్థితుల నేపథ్యంలో అవమానాలను భరిస్తూ ఉండలేనని, తన ఓర్పు, సహనం నశించిందని అందుకే పార్టీ మారుతున్నట్లు లేఖలో పేర్కొన్నారు.

ఇక తనను నమ్ముకున్న ప్రజలకు సేవ చేసుకునే అవకాశం కల్పిస్తామని, భరోసాగా నిలిచే వారితోనే తన మున్ముందు ప్రయాణం ఉండబోతోందని వివరించారు కేతంరెడ్డి. రాజకీయంగా తాను ఏ పార్టీలో ఉన్నా కూడా నీతి, నిబద్ధత తప్పనని, తనను ఆదరించే ప్రజలకు, ఇప్పటివరకు తోడుగా నిలిచిన జనసైనికులకు ఏ కష్టమొచ్చినా అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు.

ఇకపొత్తుల తరువాత వరుసగా జనసేన పార్టీ కి కీలక నేతలు గుడ్ బై చెప్పడం ఆ పార్టీ కార్యకర్తలను ఆందోళనకు గురి చేస్తోంది. మరి.. ముందు ముందు మరెంత మంది పార్టీకి వీడుతారో అనే అనుమానులు వ్యక్తమవుతున్నాయి.