Kesineni : బెజ‌వాడ టీడీపీకి మ‌రో షాక్‌… కార్పోరేట‌ర్ ప‌ద‌వికి రాజీనామా చేయ‌నున్న కేశినేని శ్వేత

బెజ‌వాడ టీడీపీలో రాజ‌కీయం ర‌స‌వ‌త్త‌రంగా మారింది. సిట్టింగ్ ఎంపీ కేశినేని నాని పార్టీపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. త‌న

  • Written By:
  • Updated On - January 8, 2024 / 08:38 AM IST

బెజ‌వాడ టీడీపీలో రాజ‌కీయం ర‌స‌వ‌త్త‌రంగా మారింది. సిట్టింగ్ ఎంపీ కేశినేని నాని పార్టీపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. త‌న అవ‌స‌రం పార్టీకి లేన‌ప్పుడు తాను కూడా పార్టీలో ఉండ‌లేన‌ని చెప్పారు. ఇప్ప‌టికే ఆయ‌న పార్టీ ఆఫీసులో జెండాల‌ను తొలిగించారు. త్వ‌ర‌లోనే ఢిల్లీ వెళ్లి స్పీక‌ర్‌ని క‌లిసి త‌న రాజీనామా లేఖ‌ను ఇస్తాన‌ని తెలిపారు. ప‌ద‌వికి రాజీనామా చేసిన త‌రువాత పార్టీ ప్రాథ‌మిక స‌భ్య‌త్వానికి కూడా రాజీనామా చేస్తాన‌ని తెలిపారు. అయితే ఎంపీ కేశినేని నాని కుమార్తె కేశినేని శ్వేత టీడీపీ నుంచి విజ‌య‌వాడ 11వ డివిజ‌న్ కార్పోరేట‌ర్‌గా ఎన్నికైయ్యారు. ఆమె కూడా త‌న కార్పోరేట‌ర్ ప‌ద‌వికి, పార్టీ ప్రాథ‌మిక స‌భ్య‌త్వానికి రాజీనామా చేయ‌నున్నారు. ఇదే విష‌యాన్ని కేశినేని నాని ట్వీట్ ద్వారా తెలిపారు. తూర్పు నియోజ‌క‌వ‌ర్గంలో త‌న‌కు స‌హ‌రించింనంద‌కు ఎమ్మెల్యే గ‌ద్దె రామ్మోహ‌న్ నివాసానికి వెళ్లి కృత‌జ్ఞ‌తలు తెల‌ప‌నున్నారు. అనంత‌రం 11 గంట‌ల‌కు కార్పోరేష‌న్ కార్యాల‌యంలో రాజీనామా లేఖ‌ను ఇవ్వ‌నున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

విజ‌య‌వాడ తూర్పు నియోజ‌క‌వ‌ర్గంలోని 11వ డివిజ‌న్ నుంచి ఆమె చివ‌రి రోజు నామినేష‌న్ దాఖ‌లు చేసి గెలిచారు. కార్పోరేష‌న్ ఎన్నిక‌ల్లో కేశినేని శ్వేత మేయ‌ర్ అభ్య‌ర్థిగా బ‌రిలోకి దిగారు. అయితే ఎన్నిక‌లకు రెండు రోజుల ముందు బుద్దా వెంక‌న్న‌, బోండా ఉమా, నాగుల్ మీరాలు క‌లిసి కేశినేని నానిపై తీవ్ర‌స్థాయిలో వ్యాఖ్య‌లు చేశారు.ఆ వ్యాఖ్య‌లు పార్టీ క్యాడ‌ర్‌ని గంద‌ర‌గోళానికి గురిచేశాయి. ఎన్నికల్లో టీడీపీ ఘోర ఓట‌మిపాలైంది. విజ‌య‌వాడ తూర్పు నియోజ‌క‌వ‌ర్గంలో త‌ప్ప ఎక్క‌డా ఎక్కువ సీట్లు టీడీపీ సాధించ‌లేదు. అప్పటి నుంచి ఎంపీ కేశినేని నాని పార్టీ అధిష్టానంతో పాటు ఈ ముగ్గురు నేత‌ల‌పై తీవ్ర‌స్థాయిలో అసంతృప్తి వ్య‌క్తం చేశారు.అధిష్టానానికి జ‌రిగిన విష‌యంపై ఫిర్యాదు చేసిన ప‌ట్టించుకోక‌పోవ‌డంతో అసంతృప్తిగానే పార్టీలో ఉన్నారు.

Also Read:  Kesineni Nani : తిరువూరు స‌భ‌లో కేశినేని నానికి ముందు వ‌రుస‌లో సీటు.. ఎంపీ రియాక్ష‌న్ ఇదే..?

తాజాగా తిరువూరు స‌భ‌తో ఎంపీ కేశినేని నానికి టికెట్ ఇవ్వ‌డంలేద‌ని తేల్చి చెప్ప‌డంతో ఆయ‌న దారి ఆయ‌న  చూసుకుంటున్నారు.  ఫిబ్ర‌వ‌రిలో కేశినేని నాని పార్టీ మారుతార‌ని.. త‌న‌కు స్ప‌ష్ట‌మైన హామీ ఇచ్చిన పార్టీలోకి వెళ్తార‌ని అనుచ‌రులు అంటున్నారు. ఇప్ప‌టికే వైసీపీ నేత‌లు కేశినేని నానితో ట‌చ్‌లో ఉన్నార‌ని స‌మాచ‌రం. విజ‌య‌వాడ ఎంపీ టికెట్‌తో పాటు మ‌రో ఎమ్మెల్యే టికెట్ ఇచ్చేందుకు వైసీపీ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింద‌ని తెలుస్తోంది. అయితే త‌న అనుచ‌రుల‌తో స‌మావేశం నిర్వ‌హించిన త‌రువాత త‌న నిర్ణ‌యం ఉంటుంద‌ని ఎంపీ కేశినేని నాని అంటున్నారు. విజ‌య‌వాడ ఎంపీగా మూడోసారి గెలిచి తీరుతానని ఆయ‌న స్పష్టం చేశారు.