Kesineni Nani : రాజకీయాల నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన మాజీ ఎంపీ కేశినేని నాని

ఇక నుంచి నా రాజకీయ ప్రయాణాన్ని ముగించా. విజయవాడపై నా నిబద్ధత బలంగానే ఉంది

  • Written By:
  • Publish Date - June 10, 2024 / 07:39 PM IST

విజయవాడ మాజీ ఎంపీ, వైసీపీ నేత కేశినేని నాని (Kesineni Nani ) కీలక ప్రకటన చేసారు. ప్రత్యక్ష రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్లు ట్విట్టర్ వేదికగా స్పష్టం చేశారు. ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా విజయవాడ స్థానం నుంచి పోటీ చేసిన కేశినేని నాని.. టీడీపీ నుంచి బరిలోకి దిగిన సోదరుడు కేశినేని చిన్ని ఫై 2 లక్షల 82 వేల 85 ఓట్ల తేడాతో ఓటమి చెందారు. ఈ క్రమంలో తాను రాజకీయాల నుండి తప్పుకుంటున్నట్లు తెలిపారు.

We’re now on WhatsApp. Click to Join.

”చాలా జాగ్రత్తగా ఆలోచించిన తర్వాతే నిర్ణయం ప్రకటించా. ఇక నుంచి నా రాజకీయ ప్రయాణాన్ని ముగించా. విజయవాడపై నా నిబద్ధత బలంగానే ఉంది. విజయవాడ అభివృద్ధికి నా వంతు మద్దతిస్తా. నా రాజకీయ ప్రయాణంలో సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. రాజకీయ అనుభవాలు, జ్ఞాపకాలను నాతో తీసుకెళ్తున్నా. విజయవాడ ప్రజలకు పదేళ్లపాటు సేవ చేశా. ఆ అపురూపమైన అవకాశం కల్పించిన ప్రజలకు మరోసారి కృతజ్ఞతలు.” అని కేశినేని నాని ఎమోషనల్ ట్వీట్ చేశారు.

టీడీపీ నుంచి రెండు పర్యాయాలు విజయవాడ ఎంపీగా కేశినాని నాని విజయం సాధించారు. కానీ లోక్‌సభ ఎన్నికలకు ముందు జరిగిన పరిణామాల తో టీడీపీ కి గుడ్ బై చెప్పి.. అధికార పార్టీ వైసీపీలో చేరారు. సిట్టింగ్ ఎంపీకి వైసీపీ విజయవాడ లోక్‌సభ టికెట్ ఇచ్చింది. కానీ రాష్ట్రవ్యాప్తంగా కూటమి హవా కొనసాగడంతో కేశినాని నాని ఎన్నికల్లో ఓటమి చెందారు.

Read Also : Modi Cabinet : మంత్రులకు శాఖలు కేటాయించిన మోడీ..