Kesineni Nani : తిరువూరు స‌భ‌లో కేశినేని నానికి ముందు వ‌రుస‌లో సీటు.. ఎంపీ రియాక్ష‌న్ ఇదే..?

  • Written By:
  • Publish Date - January 7, 2024 / 01:28 PM IST

టీడీపీ అధినేత చంద్ర‌బాబు తిరువూరు స‌భ‌పై ఎంపీ కేశినేని నాని స్పందించారు. తిరువూరు స‌భలో ఆయ‌న‌కు ముందువరుస‌లో సీటు కేటాయించారు. స‌భ‌లో అన్ని చోట్ల ఎంపీ ఫోటోల‌తో ఫ్లెక్సీలు క‌ట్టారు. అయితే దీనిపై ఆయ‌న స్పందిస్తూ.. ప్రోటోకాల్ పాటించామంటూ చెప్పుకోవ‌డానికే సీటు, ఫ్లెక్సీలు వేయించార‌ని ఆయ‌న అన్నారు. రాజీనామాపై తాను చెప్పిన మాట‌కు క‌ట్టుబ‌డి ఉంటాన‌ని తెలిపారు. ఇదే ప్రోటోకాల్ గ‌తంలో ఎంద‌కు ఇవ్వ‌లేద‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. తన పార్టీ ఆఫీసులో జెండాలు తీసేశాన‌ని.. బోర్డులు మాత్ర‌మే ఉన్నాయ‌న్నారు. త‌న రాజీనామా టెక్నిక‌ల్‌గా ఆల‌స్యం అవ్వోచ్చు కానీ పార్టీకి, ప‌ద‌వికి రాజీనామా చేస్తున్నాని మ‌రోసారి తెలిపారు.

We’re now on WhatsApp. Click to Join.

చంద్ర‌బాబు తిరువూరు ప‌ర్య‌ట‌న కోసం ఏర్పాటు చేసిన స‌న్నాహ‌క స‌మావేశంలో ఎంపీ కేశినేని నాని, చిన్ని వ‌ర్గీయులు కొట్టుకున్నారు. దీంతో రెండో రోజు తిరువూరు స‌భ ఏర్పాట్లను చిన్నికి అప్ప‌గిస్తున్న‌ట్లు అధిష్టానం ఎంపీ నానికి తెలిపింది. దీంతో ఆయ‌న తిరువూరు స‌భ‌కు దూరంగా ఉన్నారు. పార్టీ త‌న అవ‌సరం లేద‌నుకున్న‌ప్ప‌డు తాను కూడా పార్టీలో ఉండ‌లేన‌ని ఆయ‌న తెలిపారు. త్వ‌ర‌లోనే పార్టీకి, ప‌ద‌వికి రాజీనామా చేస్తాన‌ని తెలిపారు. బెజ‌వాడ టీడీపీలో ఆధిప‌త్యం కోసం పార్టీ ఓ ఎంపీని వ‌దులుకుంద‌నే భావ‌న క్యాడ‌ర్‌లో ఉంది. ముఖ్యంగా జిల్లాలో మాజీమంత్రి దేవినేని ఉమా త‌న ఆధిప‌త్యం కోసం పార్టీలో నేత‌ల మ‌ధ్య వ‌ర్గ విభేదాలు సృష్టించారు. గ‌తంలో కొడాలి నాని, వ‌ల్ల‌భ‌నేని వంశీ, వ‌సంత కృష్ణ‌ప్ర‌సాద్‌ల‌ను సైతం మాజీ మంత్రి దేవినేని ఉమా వైఖ‌రితో విసుగు చెంది పార్టీలు మారారు. ఇప్పుడు ఆ ఖాతాలో ఎంపీ కేశినేని నాని చేరారు. కేశినేని బ‌య‌టికి పోవ‌డాన‌కి మాజీ మంత్రి దేవినేని ఉమామ‌హేశ్వ‌రావు కార‌ణ‌మ‌ని క్యాడ‌ర్‌లో చ‌ర్చ జ‌రుగుతుంది.

Also Read:  CM Revanth: తెలంగాణ అంతటా పారిశ్రామిక వృద్ధికి మెగా మాస్టర్ పాలసీ: సీఎం రేవంత్

త‌న ఎంపీ నిధుల‌తో ఏర్పాటు చేసిన వాట‌ర్ ట్యాంక‌ర్ల పంపిణీలో ఆయ‌న పాల్గొన్నారు. తిరువూరు స‌భ‌కు వ‌స్తార‌ని అంద‌రూ భావించిన ఆయ‌న మాత్రం త‌న అధికారిక కార్య‌క్ర‌మంలో పాల్గోన్నారు. మైల‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గంలోని రెడ్డిగుడెం మండ‌లంలో ప‌లు గ్రామాల‌కు వాట‌ర్ ట్యాంక‌ర్లు అంద‌జేశారు. ఇప్ప‌టికే ఆయ‌న పార్ల‌మెంట్ ప‌రిధిలోని అన్ని గ్రామాల‌కు వాట‌ర్ ట్యాంక‌ర్లు మంజూరు చేశారు. వ‌చ్చే వేస‌వి కాలంలో మంచినీటి కొర‌త తీర్చ‌డానికి ఆయ‌న అన్ని గ్రామాల‌కు ఈ ట్యాంక‌ర్ల‌ను పంపిణి చేస్తున్నారు. ఇవేకాకా పార్ల‌మెంట్ ప‌రిధిలో అనేక అభివృద్ధి కార్య‌క్ర‌మాలు చేప‌ట్టారు. త‌న ఎంపీ నిధుల నుంచి వివిధ సామాజిక‌వ‌ర్గాల వారికి క‌మ్యూనిటీ భ‌వ‌నాలను నిర్మించారు.