Keshineni Nani : బాబు అరెస్టుపై రాష్ట్రపతి, ప్రధాని, కేంద్ర హోంమంత్రికి కేశినేని నాని లేఖ.. అందులో ఏముంది?

చంద్రబాబు అక్రమ అరెస్టుపై రాష్ట్రపతి, ప్రధాన మంత్రి, కేంద్ర హోంమంత్రికి టీడీపీ విజయవాడ ఎంపీ కేశినేని నాని (Keshineni Nani) లేఖ రాశారు.

Published By: HashtagU Telugu Desk
Keshineni Nani's Letter To President, Prime Minister And Union Home Minister On Babu's Arrest.. What Is In It..!

Keshineni Nani's Letter To President, Prime Minister And Union Home Minister On Babu's Arrest.. What Is In It..!

Keshineni Nani wrote letter to President : చంద్రబాబు అక్రమ అరెస్టుపై రాష్ట్రపతి, ప్రధాన మంత్రి, కేంద్ర హోంమంత్రికి టీడీపీ విజయవాడ ఎంపీ కేశినేని నాని లేఖ రాశారు.

చంద్రబాబు అరెస్టు చట్టబద్ధతపై తీవ్రమైన సందేహాలు ఉన్నాయ న్నారు. చంద్రబాబుపై జగన్ ప్రభుత్వం చేసిన ఆరోపణలు రాజకీయ ప్రేరేపితమైనవిగా కనిపిస్తున్నాయని కేశినేని నాని (Keshineni Nani) తన లేఖలో తెలిపారు. అరెస్టు చేసిన సమయం కూడా సందేహాస్పదంగా ఉందని పేర్కొన్నారు. న్యాయం, ప్రజాస్వామ్య సూత్రాలకు విలువనిచ్చే పౌరులుగా ఈ పరిస్థితిని చూస్తే బాధ కలుగుతోందని చెప్పారు. చంద్రబాబు 45 ఏళ్లుగా దేశానికి సేవలందిస్తున్నారని, అలాంటి నాయకుడిని అరెస్టు చేయడం తనను తీవ్రంగా కలిచివేసిందని కేశినేని నాని తన లేఖలో ప్రస్తావించారు.

న్యాయాన్ని కాపాడాలని, ప్రజాస్వామ్యాన్ని రక్షించాలని విజ్ఞప్తి చేశారు. ఈమేరకు రాష్ట్రపతి, ప్రధాన మంత్రి, కేంద్ర హోంమంత్రికి రాసిన మూడు లేఖలను ట్విట్టర్ వేదికగా కేశినేని నాని (Keshineni Nani) పోస్ట్ చేశారు. చంద్రబాబు నాయుడు అరెస్టు విషయంలో వెంటనే జోక్యం చేసుకోవాలని వారిని కోరారు. “దేశ అత్యున్నత పదవిలో ఉన్న తమరు మీ అధికారాన్ని, సామర్థ్యాన్ని ఉపయోగించి ఈ కేసులో న్యాయం జరిగేలా చూడాలి. బాబు అరెస్టు అంశంలో క్షుణ్ణంగా, పారదర్శకంగా, నిష్పక్షపాతంగా విచారణ జరిగేలా చూడాలి.

చంద్రబాబు అరెస్టు ఏపీ పౌరుల్లో ఆందోళన కలిగిస్తోంది” అని లేఖలో ప్రస్తావించారు.మన ప్రజాస్వామ్య ప్రక్రియలపై విశ్వాసాన్ని పునరుద్ధరించడంలో భాగంగా ఈ సమస్యను పరిష్కరించాలని కోరారు. న్యాయాన్ని కాపాడటం, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడం కోసం సత్వర చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

“చంద్రబాబుపై 120(B), 166, 167, 418, 420, 468, 471, 409 సహా పలు అభియోగాల కింద కేసు నమోదు చేశారు. అవినీతి నిరోధక చట్టం సెక్షన్ 12. 13(2) r/w 13(1) (c)&(d) 1988 కింద కేసులు బనాయించారు” అని కేశినేని నాని వివరించారు.

Also Read:  Chandrababu Horoscope : చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో ఆయన జాతకం ఎలా ఉందంటే..

  Last Updated: 09 Sep 2023, 01:57 PM IST