KCR strategy : ఆంధ్రాను గేలిచేస్తోన్న కేసీఆర్! నోరెత్తని ఏపీ పాల‌కులు!!

మూడోసారి సీఎం కావ‌డానికి కేసీఆర్ (KCR strategy) ఎంచుకున్న పంథా ఆంధ్రా వెనుక‌బాటుత‌నం. గ‌త రెండు ఎన్నిక‌ల్లోనూ ఆంధ్రోళ్ల‌ను బూచిగా చూపారు.

  • Written By:
  • Publish Date - June 7, 2023 / 04:21 PM IST

మూడోసారి సీఎం కావ‌డానికి కేసీఆర్ (KCR strategy) ఎంచుకున్న పంథా ఆంధ్రా వెనుక‌బాటుత‌నం. గ‌త రెండు ఎన్నిక‌ల్లోనూ ఆంధ్రోళ్ల‌ను బూచిగా చూపారు. రెండుసార్లు వ‌రుస‌గా సీఎం అయ్యారు. ఈసారి ఏకంగా ఆంధ్రా వెనుక‌బాటును అస్త్రంగా ఎంచుకున్నారు. మూడోసారి ముచ్చ‌ట‌గా సీఎం కావ‌డానికి ఆంధ్రాను గేలిచేస్తూ కేసీఆర్ ప్ర‌చార పంథాను ఎంచుకోవ‌డం గ‌మ‌నార్హం. గ‌త రెండు ఎన్నిక‌ల్లో ఒక శ‌త్రువుగా చూపిస్తూ ఆంధ్రా (Andhra)మీద విషం క‌క్కారు. ఇప్పుడు శ‌త్రువుపై విజ‌యం సాధించిన‌ట్టు తెలంగాణ బ‌లాన్ని ఫోక‌స్ చేస్తున్నారు. గ‌త రెండు ఎన్నిక‌ల్లో `ఇగో`ను రెచ్చ‌గొట్టిన కేసీఆర్ ఈసారి అదే `ఇగో`ను సంతృప్తి ప‌రుస్తూ భావోద్వేగాల మీద ఓట్ల‌ను రాల్చుకోవ‌డానికి ప‌న్నాగం ప‌న్నారు.

 కేసీఆర్ఎంచుకున్న పంథా ఆంధ్రా వెనుక‌బాటుత‌నం(KCR strategy) 

రాజ‌కీయ త్రాచుపాములాంటోడు కేసీఆర్ అంటారు ఆయ‌న బాధితులు. స‌మ‌యం చూసి లేవ‌కుండా ప్ర‌త్య‌ర్థుల‌ను కొడ‌తారు. ఓటుకు నోటు కేసు నుంచి తాజాగా ఫాంహౌస్ ఫైల్స్ వ‌ర‌కు అంతే. అప్ప‌ట్లో తెలుగుదేశం పార్టీని నామ‌రూపాల్లేకుండా చేసి టీఆర్ఎస్ పార్టీని బ‌తికించుకున్నారు. ఇప్పుడు బీజేపీని లేకుండా చేసిన శాశ్వ‌తంగా తెలంగాణను ఏలాల‌ని ప్లాన్ (KCR strategy)చేశారు. ఆ క్ర‌మంలోనే ఫాంహౌజ్ వేదిక‌గా ఎమ్మెల్యేల‌ను కొనుగోలు చేయాల‌ని బీజేపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి బీఎల్ సంతోష్ అండ్ టీమ్ ప్ర‌య‌త్నం చేసింద‌ని గ‌గ్గోలు పెట్టారు. దేశ వ్యాప్తంగా ఉన్న రాజ‌కీయ పార్టీల అధిప‌తుల‌కు, జ‌డ్జిల‌కు, మీడియా హౌజ్ ల‌కు వీడియో టేప్ ల‌ను పంపారు. సీన్ క‌ట్ చేస్తే, లిక్క‌ర్ స్కామ్ లో క‌విత(Delhi liquor scam) ఇరుక్కుంది. దాన్ని బ‌య‌ట ప‌డేందుకు నానా తంటాలు ప‌డుతున్నారు. ఆనాడు ఓటుకునోటు (Vote for note) కేసును చూపిస్తూ టీడీపీని లేకుండా చేసిన కేసీఆర్ ఫాంహౌస్ ఫైల్స్ చూపుతూ బీజేపీ మీద చేసిన ప్ర‌యోగం విక‌టించింది.

ఓటుకు నోటు కేసు నుంచి తాజాగా ఫాంహౌస్ ఫైల్స్ వ‌ర‌కు

జాతీయ వాదం వినిపిస్తూ ఎన్నిక‌ల‌కు వెళ్లాల‌ని భావించిన కేసీఆర్ ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్ తో తిరిగి ఆంధ్రా సెంటిమెంట్ మీద ప‌డ్డారు. మ‌రోసారి ఆంధ్రాను బూచిగా చూపించ‌డం కంటే దాని వెనుక‌బాటుత‌నంపై ప్రచారం చేస్తే తెలంగాణ ఓట‌ర్లు సంతృప్తి చెందుతార‌ని అనుకుంటున్నారు. ఒక వైపు జాతీయ వాదం అంటూనే మ‌రో వైపు ప్రాంతీయ ఆధిప‌త్యాన్ని లేవ‌నెత్తుతున్నారు. అడ‌క‌త్తెర‌లో పోక‌చెక్క‌లా మారిన కేసీఆర్ (KCR strategy)రాజ‌కీయం ఇప్పుడు గ‌తంలో మాదిరిగా ఉండ‌ద‌ని ప్ర‌త్య‌ర్థులు చెబుతున్నారు. ప్ర‌స్తుతం ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్ కార‌ణంగా బీజేపీ మీద విరుచుకుప‌డ‌లేని ప‌రిస్థితుల్లో ఆయ‌న ఉన్నారు. దీంతో ప్ర‌తిప‌క్షంలోని కాంగ్రెస్ పార్టీని విమ‌ర్శిస్తూ స‌భ‌ల‌ను నిర్వ‌హిస్తున్నారు. ఆంధ్రా చీక‌ట్లో ఉంద‌ని నానా ర‌కాలుగా దుర్బాష‌లాడుతున్నారు.

 ఏపీ వెనుక‌బాటుత‌నం తెలంగాణ అభివృద్ధి కింద

విభ‌జ‌న స‌మ‌యంలో భౌగోళికంగా విడిపోదాం, తెలుగువాళ్లుగా క‌లిసుందాం అంటూ స్లోగ‌న్ వినిపించారు. రెండు రాష్ట్రాలు అభివృద్ధి చెందాల‌ని కోరుకున్నారు. ఆ దిశ‌గా 2014 నుంచి 2019 వ‌ర‌కు న‌డిచింది.  చంద్ర‌బాబు ఏపీ అభివృద్ధిని ప‌ట్టాలు ఎక్కించారు. అమ‌రావ‌తి శంకుస్థాప‌న‌కు వెళ్లిన కేసీఆర్ అంచ‌లంచెలుగా ఏపీ అభివృద్ధిని అడ్డుకునే ప్ర‌య‌త్నం చేశారు. పోటీప‌డి గెల‌వ‌లేని ప‌రిస్థితుల్లో చంద్ర‌బాబును టార్గెట్ చేశారు. 2019 ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబును ఓడించ‌డానికి స‌ర్వ‌శ‌క్తుల‌ను కేసీఆర్ (KCR strategy)ఒడ్డారు. ఫ‌లితంగా కేసీఆర్ అనుకున్న వెనుక‌బాటుత‌నం ఏపీలో క‌నిపిస్తోంది. దాన్నే తెలంగాణ అభివృద్ధి కింద చెప్పుకోవ‌డం గ‌మ‌నార్హం.

Also Read : KCR Strategy: కేసీఆర్ మైండ్ గేమ్.. ప్రత్యర్థిని తేల్చేసిన గులాబీ బాస్!

నిజ‌మైన అభివృద్ధి అంటే రెండు రాష్ట్రాల్లో పాజిటివ్ కోణంలో పోటీప‌డాలి. ప్ర‌త్య‌ర్థిని కుట్ర‌లు, కుతంత్రాల‌తో ప‌డ‌గొట్ట‌డం ద్వారా విజ‌యం సాధించాల‌ని అనుకోవ‌డం అభివృద్ధి కింద‌కు రాదు. గ‌త నాలుగేళ్లుగా పూర్తిగా ఆగిన ap అభివృద్ధిని చూపిస్తూ తెలంగాణ ప్ర‌గ‌తి అంటూ కేసీఆర్ ఓట‌ర్ల‌ను మ‌భ్య‌పెడుతున్నారు. అమ‌రావ‌తి ప్రాజెక్టు ఆగిపోవ‌డంతో హైద‌రాబాద్ అభివృద్ధి వేగం పుంజుకుంద‌ని మంత్రులు హ‌రీశ్‌, కేటీఆర్ వ్యాఖ్యానించారు. రాజ‌కీయంగా చంద్ర‌బాబును ఎవ‌రైనా విమ‌ర్శించ‌డానికి అవ‌కాశం ఉందిగానీ, విజ‌న్ ప‌రంగా ఆయ‌న్ను ఎవ‌రూ విమ‌ర్శంచ‌లేర‌ని కేటీఆర్ ప్ర‌శించారు. అంటే, చంద్ర‌బాబు ఏపీ సీఎంగా ఉంటే తెలంగాణ అభివృద్ధి ఆగిపోతుంద‌న్న ఆందోళ‌న వాళ్ల‌ను వెంటాడింది. అందుకోసం చంద్రబాబు బ‌దులుగా అక్క‌డ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిని తెలంగాణ సీఎం కేసీఆర్ (KCR strategy) ప్ర‌తీష్టించారు.

ఏపీతో పోల్చుకుంటూ మూడోసారి మోసం (KCR strategy)

అసెంబ్లీ బ‌య‌ట, లోప‌ల ఏపీ అభివృద్ధి ఆగిపోవ‌డాన్ని సీఎం కేసీఆర్ ప‌లుమార్లు ప్ర‌స్తావించారు. ఒక‌ప్పుడు ఆంధ్రాలో ఎక‌రం అమ్ముకుంటే తెలంగాణలో మూడు ఎక‌రాలు వ‌చ్చేద‌ని, ఇప్పుడు అది రివ‌ర్స్ అయింద‌ని గేలిచేస్తున్నారు. తెలంగాణ వెలుగుజిలుగుల‌తో ఉంటే, ఆంధ్రా అంధ‌కారంలోకి వెళ్లింద‌ని వ్యంగ్యాస్త్రాల‌ను సంధిస్తున్నారు. ఒక‌ప్పుడు రాష్ట్రాలు విడిపోతే, క‌రెంట్ లేక తెలంగాణ చీక‌ట్లోకి వెళుతుంద‌ని చెప్పిన లీడ‌ర్లు ఇప్పుడు ఆంధ్రాను చీక‌ట్లోకి నెట్టార‌ని కేసీఆర్ విమ‌ర్శిస్తున్నారు. ఆయ‌న విమ‌ర్శ‌లకు క‌నీసం ధీటైన స‌మాధానం ఇవ్వ‌డానికి ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ధైర్యం చేయ‌లేక‌పోతున్నారు. దీంతో కేసీఆర్ మ‌రింత రెచ్చిపోతూ, అభివృద్ధి ఆగిపోయిన ఏపీతో పోల్చుకుంటూ తెలంగాణ ప్ర‌గ‌తిని చూపిస్తూ ఓట‌ర్ల‌ను మూడోసారి మోసం చేయ‌డానికి (KCR strategy) సిద్ధ‌మ‌వుతున్నారు. ఆంధ్రాను ఈసారి మ‌రోలా అస్త్రంగా చేసుకుంటూ ప్ర‌చారంలో దూసుకుపోతున్న కేసీఆర్ తెలంగాణ ఓట‌ర్ల‌ను ఎలాగైనా మ‌భ్య పెట్ట‌గ‌ల‌రు. ఆ విష‌యాన్ని ప్ర‌త్య‌ర్థి పార్టీలు సైతం అంగీక‌రించ‌డం ఒక ఎత్తైతే, ఏపీ పాల‌కులు నోరుమెద‌ప‌క‌పోవ‌డం ఆశ్చ‌ర్య‌క‌రం.

Also Read :  Jagan cinema : వెండితెర‌పై జగ‌న్‌ తాండ‌వం, `ఫైబ‌ర్ నెట్ ` లో కొత్త సినిమాల‌ రిలీజ్‌