Rameshwar Rao RS Seat?: రామేశ్వరావు రాజ్యసభ పై కెసీఆర్ నీడ

తెలంగాణ సీఎం కెసీఆర్ ప్రభావం మైహోం జూప‌ల్లి రామేశ్వ‌ర‌రావు రాజ్యసభ ఎంపికపై పడింది. ఫలితంగా చివరి నిమిషంలో వైసీపీ హ్యాండిచిందని ప్రచారం ఉంది.

  • Written By:
  • Publish Date - May 15, 2022 / 07:00 AM IST

తెలంగాణ సీఎం కెసీఆర్ ప్రభావం మైహోం జూప‌ల్లి రామేశ్వ‌ర‌రావు రాజ్యసభ ఎంపికపై పడింది. ఫలితంగా చివరి నిమిషంలో వైసీపీ హ్యాండిచిందని ప్రచారం ఉంది. ఇప్ప‌టికే జ‌గ‌న్‌కు అవ‌స‌ర‌మైతే తాను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో అధికారికంగా చేర‌తాన‌ని, త‌న‌ను రాజ్య‌స‌భ‌కు పంపించాల‌ని విజ్ఞ‌ప్తి చేశారట. అయితే సామాజిక స‌మీక‌ర‌ణాల నేప‌థ్యంతోపాటు పార్టీ అవ‌స‌రాల‌ను దృష్టిలో పెట్టుకొని రామేశ్వ‌ర‌రావుకు మొండిచెయ్యి చూపించిన‌ట్లు తెలుస్తోంది. దీనివెన‌క తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ లాబీయింగ్ ప‌నిచేసింద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు భావిస్తున్నారు.
స‌మ‌తామూర్తి విగ్ర‌హావిష్క‌ర‌ణ త‌ర్వాత కేసీఆర్‌కు, చిన‌జీయ‌రుకు దూరం పెరిగిన సంగ‌తి తెలిసిందే. దీంతోపాటు మైహోం రామేశ్వ‌ర‌రావుకు కూడా అంతే దూరం పెరిగింది. కేసీఆర్‌, జ‌గ‌న్ స‌న్నిహితులు. ఆ కోణంలోనే రాజ్య‌స‌భ స‌భ్య‌త్వం ద‌క్క‌లేద‌ని సీనియ‌ర్ రాజ‌కీయ వేత్త‌లు విశ్లేషిస్తున్నారు. సంబంధాలు బాగుంటే తెలంగాణ కోటా నుంచే జూప‌ల్లిని ఎంపిక చేసే అవకాశం ఉండేదని టాక్.

రాజ్య‌స‌భ స‌భ్య‌త్వం ఇస్తాన‌నే హామీపై తెలుగుదేశం నుంచి వైసీపీలో చేరిన నెల్లూరు జిల్లా బీసీ నేత బీద మ‌స్తాన్‌రావు, శ్రీ‌కాకుళం జిల్లాకు చెందిన కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణిని ఎంపిక చేసిన‌ట్లు వైసీపీ వ‌ర్గాల్లో ప్ర‌చారం న‌డుస్తోంది. వీరితోపాటు రాజ్య‌స‌భ రేసులో నిలిచిన సినీ న‌టుడు అలి, వైవీ సుబ్బారెడ్డి, మ‌ర్రి రాజ‌శేఖ‌ర్‌కు మ‌రోసారి నిరాశ త‌ప్ప‌ద‌నే వ్యాఖ్య‌లు వ‌స్తున్నాయి. అయితే, అధికారికంగా అభ్య‌ర్థుల ప్ర‌క‌ట‌న వెలువ‌డేవ‌ర‌కు వేచిచూడ‌క త‌ప్ప‌దు.
రెండు తెలుగు రాష్ట్రాల‌తోపాటు దేశ‌వ్యాప్తంగా 57 రాజ్య‌స‌భ స్థానాల‌కు కేంద్ర ఎన్నిక‌ల సంఘం షెడ్యూల్ విడుద‌ల చేసింది. ఏపీలో మొత్తం నాలుగు స్థానాలు ఖాళీ అవుతున్నాయి. ఈ నాలిగింటినీ అధికార వైసీపీ సునాయాసంగా చేజిక్కించుకుంటోంది. విజ‌య‌సాయిరెడ్డి, బీజేపీకి చెందిన సుజ‌నా చౌద‌రి, టీజీ వెంక‌టేష్‌, కేంద్ర మంత్రి సురేష్ ప్ర‌భుల ప‌ద‌వీ కాలం ముగిసిపోయింది. వీరిలో విజ‌య‌సాయిరెడ్డిని తిరిగి రాజ్య‌స‌భ‌కు పంపించాల‌ని ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ ఇప్ప‌టికే ప్రాథ‌మికంగా నిర్ణ‌యించారు. ఆదాని కుటంబం కు ఒకటి, బీద మస్తాన్ రావు, కిల్లి కృపారాణి, విజయసాయిరెడ్డి లను ఎంపిక చేసినట్టు తెలుస్తుంది. చివరి వరకు మార్పులు లేకపోతే ఆ నలుగురు ఫైనల్ గా ఉంటారు. ఇప్పటికైతే రామేశ్వరావుకు వైసీపీ హాండ్ ఇచ్చిందని తెలుస్తుంది. ఇదంతా కేసీఆర్ ఎఫెక్ట్ గా పొలిటికల్ సర్కిల్స్ లోని టాక్.