Site icon HashtagU Telugu

BRS CM in AP: కాపులకు కేసీఆర్ బంపర్ ఆఫర్, ఏపీ సీఎం పదవి ఎర

Kcr Bumper Offer To Kapus, Ap BRS Cm Post Bait

Kcr Bumper Offer To Kapus, Ap Cm Post Bait

ఏపీ సీఎం పదవిని కాపులకు ఇవ్వడానికి బీఆర్ఎస్ (BRS) చీఫ్ కేసీఆర్. ఆఫర్ ఇవ్వడానికి సిద్ధపడ్డారని తెలుస్తుంది. కాపు సమీకరణ నముకున్న ఆయన జగన్ కు పరోక్షంగా సహకారం అందిస్తున్నారు. తోట చంద్రశేఖర్ సహా ఇతర నాయకులు బీఆర్ఎస్‌లో (BRS) చేరికకు గల కారణాలపై చర్చించినట్లుగా తెలుస్తోంది. ఏపీలో కాపులను సీఎం చేస్తానని కేసీఆర్ హామీ ఇచ్చారని తోట చంద్రశేఖర్ తెలిపారు. కేసీఆర్ హామీ వెనుక ప్రణాళికపై చర్చించారు నేతలు. ఇప్పటికే ఏపీ రాజకీయాలపై కేసీఆర్ ఫోకస్ పెట్టారు. త్వరలో ఆంధ్రప్రదేశ్‌లో సభలు, సమావేశాలకు కేసీఆర్ సిద్ధమయ్యారు. అలాగే టీడీపీ జనసేన పొత్తులపైనా ఆసక్తికర చర్చ జరుగుతోంది.

ఇరు పార్టీలు కలిస్తే ఎవరికి అడ్వాంటేజ్, కాపులకు పవర్ షేరింగ్ ఛాన్స్ ప్రస్తావించారు. ఇటీవల కాపు నేత హరిరామ జోగయ్య రాసిన లేఖపైనా ఈ సమావేశంలో చర్చించారు. ఈ క్రమంలో ఏపీ కాపు నేతల వరుస సమావేశాలు ఆసక్తిని రేకిత్తిస్తున్నాయి. వచ్చే ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు సంబంధించి రాష్ట్రంలో పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. ప్రధానంగా కాపుల చుట్టూ రాజకీయాలు తిరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో ఇటీవల ఏపీ కాపు నేతల సమావేశం జరిగింది. ఈ భేటీకి బీఆర్ఎస్ (BRS) ఏపీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్, టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, బీజేపీ నేత కన్నా లక్ష్మీ నారాయణ తదితర కాపు ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏపీకి సంబంధించి కేసీఆర్ విధానాలను తోట చంద్రశేఖర్ వివరించారు. అలాగే వైసీపీ, టీడీపీ, బీజేపీ, జనసేనల్లోని కాపు నేతల గురించి వీరంతా చర్చించినట్లుగా తెలుస్తోంది.

మరోవైపు కాపు సంక్షేమ నేత, మాజీ మంత్రి చేగొండి హరిరామ జోగయ్య కీలక వ్యాఖ్యలు చేశారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో అధికార వైసీపీని ఓడించాలంటూ పొత్తులు తప్పవని స్పష్టం చేశారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకుండా వుండేందుకు పొత్తులు అత్యవసరమని ఆయన అన్నారు. వైసీపీని ఓడించే సత్తా టీడీపీ – జనసేనకే వుందని ఆయన అభిప్రాయపడ్డారు. పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రిగా వుండాలనేది కాపు సంక్షేమ సేన ప్రధాన డిమాండ్ అని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్ర జనాభాలో 22 శాతం వున్న కాపు సామాజిక వర్గానికి రాజ్యాధికారం దక్కాలని, అంటే సీఎం పదవేనని హరిరామ జోగయ్య కుండబద్ధలు కొట్టారు. అంటే సీఎం పదవిని ఎర వేయటం ద్వారా కాపులకు గాలం వేయాలని కేసీఆర్ రంగం సిద్ధం చేశారు. ఆయన వ్యూహం ఎంత వరకు ఫలిస్తుందో చూడాలి.

Also Read:  PM Modi: రైసినా డైలాగ్ 2ను ప్రారంభించిన ఇటలీ ప్రధాని జార్జియా మెలోని, ప్రధాని మోదీ!