AP Elections : ఏపీలో మరోసారి జగన్ అధికారంలోకి రావొచ్చు ..? – కేసీఆర్

త్వరలో ఏపీలో జరిగే ఎన్నికల్లో జగన్ మళ్లీ గెలుస్తారనే సమాచారం అందుతుందని కేసీఆర్ వెల్లడించారు.

Published By: HashtagU Telugu Desk
Kcr Cm Jagan

Kcr Cm Jagan

ఏపీలో మరోసారి జగనే (Jagan) అధికారంలోకి రావొచ్చన్నారు బిఆర్ఎస్ అధినేత , మాజీ సీఎం కేసీఆర్ (KCR). మంగళవారం ఓ ప్రముఖ టీవీ ఛానల్ లో పాల్గొన్న ఆయన..అనేక విషయాలపై క్లారిటీ ఇస్తూ..ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో (AP Elections) ఎవరు విజయం సాదించబోతున్నారు..? కూటమి విజయం సాధిస్తుందా..? మీ చిరకాల మిత్రుడు జగన్ గెలవబోతున్నారా..? అనే ప్రశ్నకు కేసీఆర్ సమాధానం ఇచ్చారు.

We’re now on WhatsApp. Click to Join.

త్వరలో ఏపీలో జరిగే ఎన్నికల్లో జగన్ మళ్లీ గెలుస్తారనే సమాచారం అందుతుందని కేసీఆర్ వెల్లడించారు. ‘ఏదొక పార్టీకి నేను వత్తాసు పలకడం సరికాదు. వాళ్ల రాజకీయాలు వాళ్లు చేసుకుంటున్నారు. నాకు అందే సమాచారం ప్రకారం జగనే గెలుస్తారు. ఎవరు గెలిచిన మాకేం సంబంధం లేదు..ఈ సమయంలో నేను ఓ పార్టీ కి వత్తాసు పలకడం అంత మంచిది కాదని చెప్పుకొచ్చారు. ఏపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఎలాంటి జోక్యం చేసుకోదు. భవిష్యత్తులో వచ్చే ఎన్నికల్లో ఆలోచిద్దాం’ అని క్లారిటీ ఇచ్చారు. దీనిపై కూటమి..వైసీపీ శ్రేణులు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.

అలాగే తెలంగాణ లో సంచలనం రేపుతున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం పై కూడా ప్రశ్నించగా..కేసీఆర్ దానికి సమాధానం ఇచ్చారు. గత ప్రభుత్వం లో ఫోన్ ట్యాపింగ్ చేశారనే ఆరోపణల్లో ఏమాత్రం నిజం లేదు..అదంతా ఫాల్స్ ప్రచారం తప్ప మరోటిలేదు. ఫోన్ ట్యాపింగ్ అనేది పోలీసులు చేస్తుందే..పోలిసుల నిఘా అనేది అంత సీఎం చేతిలోనే ఉంటుంది కదా…అసలు ఫోన్ ట్యాపింగ్ అనేది కొత్తదేమీ కాదు. ఏ దేశానికైనా , రాష్ట్రానికైనా నిఘా వ్యవస్థ అనేది అవసరం.

Read Also : KCR & Revanth : రేవంత్ అందుకే నాపై కక్ష కట్టాడు – కేసీఆర్

  Last Updated: 23 Apr 2024, 10:37 PM IST