AP : కాబోయే సీఎం చంద్రబాబే..ఆయనకే మీ సమస్యలు చెప్పుకోండి – కారుమూరి

కారుమూరి నాగేశ్వరావు వద్దకు పలువురు స్థానికులు వచ్చి తమ సమస్యలు చెపుతుండగా..కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు అని..ఆయనే మీ సమస్యలు చెప్పుకోండి అంటూ నాగేశ్వరావు చెప్పడం ఇప్పుడు వైరల్ గా మారాయి

Published By: HashtagU Telugu Desk
Karumuri Cbn

Karumuri Cbn

ఏపీ ఎన్నికల ఫలితాలపై ఎలాంటి ఉత్కంఠ నెలకొందో తెలియంది కాదు. మే 13 న ఏపీలో 174 అసెంబ్లీ , 25 పార్లమెంట్ స్థానాలకు సంబదించిన పోలింగ్ జరిగింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి పోలింగ్ శాతం పెరగడం తో అధికారపార్టీ కి మేలు జరుగుతుందా…లేక ప్రతిపక్ష పార్టీలకు మేలు జరుగుతుందా అని అంత మాట్లాడుకుంటున్నారు. ఇదే క్రమంలో ఈసారి కూటమి పార్టీకి ప్రజలు మద్దతు పలికారని పలు సర్వేలు చెపుతున్నాయి. కూటమి అభ్యర్థులు సైతం గెలుపు ఫై ధీమా గా ఉన్నారు.

We’re now on WhatsApp. Click to Join.

వైసీపీ నేతల్లో కూడా ఓటమి భయం పట్టుకుందని..అందుకే వారు పోలింగ్ జరిగిన క్షణమే తమ ఓటమిని చెప్పకనే చెప్పారని టీడీపీ నేతలు చెపుతూ వస్తున్నారు. తాజాగా వైసీపీ మంత్రి కారుమూరి నాగేశ్వరావు చేసిన కామెంట్స్ ఇప్పుడు టీడీపీ శ్రేణులకు మరింత బలం పెంచుతున్నాయి. కారుమూరి నాగేశ్వరావు వద్దకు పలువురు స్థానికులు వచ్చి తమ సమస్యలు చెపుతుండగా..కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు అని..ఆయనే మీ సమస్యలు చెప్పుకోండి అంటూ నాగేశ్వరావు చెప్పడం ఇప్పుడు వైరల్ గా మారాయి. దీని బట్టి ఏపీలో కూటమి విజయం ఖాయమని అంత మాట్లాడుకుంటున్నారు.

Read Also : Most Influential Companies: ప్ర‌పంచంలోనే అత్యంత ప్రభావవంతమైన కంపెనీల జాబితాలో రిల‌య‌న్స్‌, టాటా గ్రూప్..!

  Last Updated: 31 May 2024, 11:09 AM IST