ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. అధికార కూటమి పార్టీకి భారీ షాక్ తగిలింది. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నుంచి పలువురు టీడీపీ, బీజేపీ నేతలు వైఎస్సార్‌సీపీలో చేరారు. టీడీపీకి చెందిన మధు, మల్లికార్జున్, బీజేపీ అసెంబ్లీ ఇంఛార్జ్ మురహరిరెడ్డి, బీజేపీ నేత కిరణ్ కుమార్‌తో పాటు వారి అనుచరులు జగన్ సమక్షంలో చేరడం ఆ పార్టీకి ఊతమిచ్చింది. వారితో పాటు పీజీ రాంపుల్లయ్య యాదవ్, మోనికా రెడ్డి, లోక్‌నాథ్ యాదవ్, ప్రదీప్ వెంకటేష్ యాదవ్, నరసింహులు యాదవ్, షబ్బీర్ అహ్మద్, ఫైరోజ్ వంటి స్థానిక స్థాయిలో ప్రభావం కలిగిన నాయకులు కూడా చేరారు. వీరందరూ కర్నూలు రాజకీయాల్లో కీలక పాత్ర పోషించినవారే కావడంతో, ఈ పరిణామం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
Prime Minister Routine Checkup: ప్రధానమంత్రి మోదీ ఆరోగ్య ప్రోటోకాల్.. ప్రతి 3 నెలలకు ఒకసారి చెకప్!
ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీ అధినేత జగన్ పార్టీ కార్యకర్తల కోసం ప్రత్యేకంగా ఒక డిజిటల్ బుక్‌ను విడుదల చేశారు. “ఇది కార్యకర్తలకు శ్రీరామ రక్షలా ఉంటుంది” అని ఆయన పేర్కొన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కార్యకర్తలపై జరిగిన అన్యాయాలను, ఒత్తిడులను ఈ బుక్‌లో నమోదు చేయాలని సూచించారు. ఆ రికార్డుల ఆధారంగా భవిష్యత్తులో ప్రత్యేక బృందాలు ఏర్పరచి, అన్యాయం చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని జగన్ స్పష్టం చేశారు. రిటైరైన వారైనా, ఎక్కడ ఉన్నా వారిని చట్టం ముందు నిలబెట్టి శిక్షించేందుకు వెనుకాడబోమని ప్రకటించారు. ఈ విధానంతో పార్టీ కార్యకర్తల్లో నమ్మకం పెరుగుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
కర్నూలు జిల్లాలో కూటమి నేతలు ఒక్కసారిగా వైఎస్సార్‌సీపీలో చేరడం, అదే సమయంలో జగన్ కొత్త డిజిటల్ బుక్‌ను ప్రవేశపెట్టడం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త చర్చలకు దారితీసింది. ఒకవైపు అధికార కూటమి పార్టీలు స్థానిక స్థాయిలో బలహీనపడుతుండగా, మరోవైపు జగన్ నేతృత్వంలోని వైఎస్సార్‌సీపీ మరింత బలపడుతోంది. ఈ పరిణామాలు రాబోయే ఎన్నికల సమీకరణాలపై ప్రభావం చూపే అవకాశముంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో, స్థానిక నాయకత్వం ఆధారంగా ఎన్నికలు సాగుతాయి. ఈ క్రమంలో కూటమి నుంచి వచ్చిన నేతల మద్దతుతో వైఎస్సార్‌సీపీ మరింత శక్తివంతం కావచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.