Kapu Strategy : `వంగ‌వీటి`చ‌రిష్మా కోసం`తోట‌`పాట్లు!`కాపు` గేమ్ లో ఇదో అంకం..!

స్వ‌ర్గీయ వంగ‌వీటి రంగా రాజ‌కీయ వార‌స‌త్వాన్ని(Kapu Strategy ) పంచుకోవ‌డానికి

  • Written By:
  • Updated On - February 23, 2023 / 02:47 PM IST

స్వ‌ర్గీయ వంగ‌వీటి రంగా రాజ‌కీయ వార‌స‌త్వాన్ని(Kapu Strategy ) పంచుకోవ‌డానికి జ‌నసేనాని ప‌వ‌న్ కు తోడుగా ఇప్పుడు బీఆర్ఎస్ ఏపీ చీఫ్ తోట చంద్ర‌శేఖ‌ర్(Thota Chandrasekhar) బ‌య‌లు దేరారు. విజ‌య‌వాడ కేంద్రంగా జ‌రిగిన ర్యాలీ సంద‌ర్భంగా నాట‌కీయంగా ఆయ‌న బంద‌ర్ రోడ్డులోని వంగ‌వీటి రంగా విగ్ర‌హానికి పూల‌మాలవేసి నివాళుల‌ర్పించారు. వాస్త‌వంగా బీఆర్ఎస్ పార్టీకి, వంగ‌వీటి రంగాకు ఎలాంటి సంబంధంలేదు. కానీ, సామాజిక‌వ‌ర్గం మ‌ద్ధ‌తు కోసం తోట చంద్ర‌శేఖ‌ర్ స్వ‌ర్గీయ వంగ‌వీటి రంగా నామ‌స్మ‌ర‌ణ ప్రారంభించారు. ప్ర‌జా రాజ్యం పెట్టిన సంద‌ర్భంగా కొన్నేళ్ల పాటు మెగాస్టార్ చిరంజీవి వ్మూహాత్మ‌కంగా రంగా చ‌రిష్మాను వాడుకున్నారు. ఆ త‌రువాత ప్ర‌జారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసి, రంగాను మ‌ర‌చిపోయారు.

స్వ‌ర్గీయ వంగ‌వీటి రంగా రాజ‌కీయ వార‌స‌త్వాన్ని(Kapu Strategy)

ఎనిమిదేళ్ల క్రితం జ‌న‌సేన పార్టీని పెట్టిన ప‌వ‌న్ క‌ల్యాణ్ సినిమాటిక్ గా కాపు నేత‌ల చ‌రిష్మాను(Kapu Strategy ) సానుకూలంగా మ‌లుచుకున్నారు. కులం, ప్రాంతం, మ‌తాల‌కు అతీతంగా జ‌న‌సేన పార్టీని పెట్టామ‌ని చెబుతూనే కాపు రిజ‌ర్వేష‌న్ అంశాన్ని తెర‌మీద‌కు తీసుకొచ్చారు. కాపు జాతి నేత‌లుగా తెర‌మీద‌కు వ‌చ్చిన ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం, హ‌రిరామ‌జోగ‌య్య లాంటి వాళ్ల ఆశీస్సులు పొందారు. స్వ‌ర్గీయ వంగ‌వీటి రంగా చ‌రిష్మాను ఇప్ప‌టికీ ఆయ‌న సొంతం చేసుకుంటూ ముందుకు వెళుతున్నారు. హ‌ఠాత్తుగా ఇప్పుడు తోట చంద్ర‌శేఖ‌ర్ (Thota Chandrasekhar)కూడా రంగా చ‌రిష్మాను షేర్ చేసుకోవ‌డానికి రంగంలోకి దిగారు. స్వ‌ర్గీయ రంగా వార‌సునిగా ఉన్న వంగ‌వీటి రాధా మాత్రం టీడీపీలో ఉన్నారు. ఆయ‌న ఆ పార్టీ నుంచి ఈసారి పోటీ చేస్తార‌ని తెలుస్తోంది.

Also Read : Kapu Game : `వంగ‌వీటి` రాజ‌కీయ చ‌ద‌రంగంపై జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి చెల‌గాటం!

విజ‌య‌వాడ కేంద్రంగా వెల‌సిన కాపు సామాజ‌క‌వ‌ర్గం నినాదం ఇప్పుడు ముక్కుల‌వుతోంది. ఆనాడు రంగా తీసుకొచ్చిన కాపు ఐక్య‌త నుంచి బ‌లిజ‌, శెట్టి బ‌లిజ‌, తెల‌గ‌, ఒంట‌రి కులాలు త‌ప్పుకున్నాయ‌ట‌. ఇదంతా రాజ‌కీయ ఎదుగుద‌ల కోసం కాపులు వ్యూహాత్మ‌కంగా ఉప‌యోగించిన నినాదంగా వాళ్లు భావిస్తూ చాలా వ‌ర‌కు ప‌క్క‌కు జ‌రిగారని చెప్పుకుంటున్నారు. ఆ విష‌యాన్ని వైసీపీ గ్ర‌హించి తాజాగా శెట్టి బ‌లిజ‌, బ‌లిజ‌, తెల‌గ‌, ఒంట‌రి కులాల‌కు ప్రాధాన్యం ఇస్తోంది. కాపు సామాజిక‌వ‌ర్గానికి తూతూ మంత్రంగా ప్రాధాన్యం ఇస్తూ ఎమ్మెల్సీ ఎంపిక జ‌రిగింది. ప్ర‌స్తుతం జ‌నసేన రూపంలో టీడీపీ ప‌క్షాన కాపులు నిలుస్తార‌ని ప్ర‌త్య‌ర్థుల అంచనా. అందుకే, కాపు ఓటు బ్యాంకును చీల్చేందుకు బీఆర్ఎస్ రూపంలో తోట చంద్ర‌శేఖ‌ర్(Thota Chandrasekhar) ను కేసీఆర్ రంగంలోకి దింపార‌ని టాక్‌.

రాజ‌కీయంగా కేసీఆర్, జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి వేర్వేరు కాదు

రాజ‌కీయంగా కేసీఆర్, జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి వేర్వేరు కాదు. వాళ్లిద్ద‌రూ ఇచ్చిపుచ్చుకునే అన్న‌ద‌మ్ముల మాదిరిగా ఉన్నారు. ప్ర‌స్తుతం ప‌వ‌న్ రూపంలో యువ‌త‌, కాపు ఓటు బ్యాంకు కొంత (Kapu Strategy )చీల‌నుంద‌ని జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి గ్ర‌హించారు. ఆ ఓట్లు టీడీపీకి వెళ్ల‌కుండా ఉండ‌డానికి కేసీఆర్, జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి క‌ల‌సి ఉమ్మ‌డి మాస్ట‌ర్ స్కెచ్ వేశార‌ని రాజ‌కీయ వ‌ర్గాల్లోని టాక్‌. అందుకే, బీఆర్ఎస్ చీఫ్ గా తోట చంద్ర‌శేఖ‌ర్ కు బాధ్య‌త‌లు అప్ప‌గించార‌ని స‌ర్వ‌త్రా వినిపిస్తోన్న ఆరోప‌ణ‌. స్వ‌త‌హాగా తోట చంద్ర‌శేఖ‌ర్ గోదావ‌రి జిల్లాల‌కు చెందిన కాపు సామాజిక‌వ‌ర్గం. అదే ప‌వ‌న్ క‌ల్యాణ్ అందుకు భిన్న‌మ‌ని కాపులోని ఒక వ‌ర్గం భావిస్తోంది. అప్ప‌ట్లో నిజ‌మైన కాపు ఎవ‌రు? అనే చ‌ర్చ‌కు తెర‌లేపిన దాస‌రి నారాయ‌ర‌ణ‌రావు మాదిరిగా ఎన్నిక‌ల నాటికి `తోట‌` రూపంలో అదే చ‌ర్చ ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్ల‌డానికి ప్లాన్ జ‌రుగుతుంద‌ని తెలుస్తోంది.

Also Read : Kapu Reservation : టీడీపీ, జ‌న‌సేన `పొత్తు`పోటు, కాపు సేన అధిప‌తి ఎత్తుగ‌డ?

రాష్ట్ర వ్యాప్తంగా 175 స్థానాల్లోనూ పోటీ చేయ‌డానికి బీఆర్ఎస్ సిద్ద‌మైయింది. ఆ మేర‌కు విజ‌య‌వాడ‌లో జ‌రిగిన ర్యాలీ సంద‌ర్భంగా తోట చంద్ర‌శేఖ‌ర్ (Thota Chandrasekhar)ప్ర‌క‌టించారు. స్వ‌త‌హాగా రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారిగా ఉన్న `తోట` రాజ‌కీయాల్లోకి మెగా స్టార్ చిరంజీవి పెట్టిన ప్ర‌జారాజ్యం ద్వారా తెర‌మీద‌కు వ‌చ్చారు. ఆ త‌రువాత జ‌న‌సేన పార్టీ కోసం ఒక ఛాన‌ల్ ను కూడా పెట్టారు. కేవ‌లం కాపు(మోజార్టీ) సామాజిక‌వ‌ర్గం ఉద్యోగుల‌తో మాత్ర‌మే ఆ ఛానల్ ను న‌డుపుతార‌ని కూడా టాక్ ఉంది. ఆ ఛాన‌ల్ ద్వారా ప‌వ‌న్ క‌ల్యాణ్ ను ఆకాశానికి ఎత్తుతూ ఇప్ప‌టి వ‌ర‌కు ఆయ‌న మీడియా రంగాన్ని ఉప‌యోగించుకున్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ చీఫ్ గా ఏపీ అభివృద్ధి గురించి మాట్లాడుతున్నారు.

ఏపీ రాజ‌కీయాల‌ను మ‌లుపు తిప్పాల‌ని 

`లంక‌లో పుట్టిన వాళ్లంద‌రూ రాక్ష‌సులు, ఆంధ్రాలో పుట్టిన వాళ్లంద‌రూ దోపిడీదారులు..` అంటూ నినాదించిన కేసీఆర్ ప‌క్షాన `తోట‌` చేరారు. తెలంగాణ మోడ‌ల్ అభివృద్ధి ని ఏపీలో తీసుకొస్తానంటూ హామీ ఇస్తున్నారు. గ‌తంలో ప‌వ‌న్ క‌ల్యాణ్ కూడా తెలంగాణలో ఎందుకు పుట్ట‌లేద‌ని బాధ‌ప‌డుతున్నాన‌ని వ్యాఖ్యానించారు. వీళ్లిద్ద‌రూ ఒక వైపు కేసీఆర్‌, తెలంగాణ పాట పాడుతూ ఇంకో వైపు ఏపీ రాజ‌కీయాల‌ను మ‌లుపు తిప్పాల‌ని చూస్తున్నారు. అందుకోసం కాపు సామాజిక‌వ‌ర్గం మ‌ద్ధ‌తు కూడ‌గ‌ట్టుకోవ‌డం కోసం పోటీ ప‌డుతున్నారు. ఆ క్ర‌మంలో స్వ‌ర్గీయ వంగ‌వీటి రంగా చ‌రిష్మాను(Kapu Strategy ) వాడుకోవ‌డానికి ప్ర‌య‌త్నించ‌డం కాపుల్లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

Also Read : Vizag kapu : కాపునాడుకు వైసీపీ డుమ్మా, 5శాతం రిజ‌ర్వేజ‌న్ పై జ‌గ‌డం