AP BRS: కాపుల అభ్యున్నతికి కృషి చేస్తున్న కేసీఆర్ కు కాపుల సంఘీభావం

అవసరమైన భూమిని కేటాయించడం పట్ల కాపులు హర్షం వ్యక్తం చేస్తున్నారని బిఆర్ఎస్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్ష్యులు డాక్టర్ తోట చంద్రశేఖర్ అన్నారు.

  • Written By:
  • Updated On - August 4, 2023 / 05:37 PM IST

కాపు ,తెలగ,బలిజ,ఒంటరి,తూర్పు కాపుల అభ్యున్నతికి పెద్దపీట వేస్తూ సిఎం కెసిఆర్ సౌత్ ఇండియా సెంటర్ ఫర్ కాపు కమ్యూనిటీ భవన నిర్మాణానికి అవసరమైన భూమిని కేటాయించడం పట్ల కాపులు హర్షం వ్యక్తం చేస్తున్నారని బిఆర్ఎస్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్ష్యులు డాక్టర్ తోట చంద్రశేఖర్ అన్నారు. శుక్రవారం కాపు సంఘాల సంక్షేమ సేవా సమితి అధ్యక్షులు మిరియాల రాఘవరావు ఆధ్వర్యంలో జంట నగరాల్లోని వివిధ కాపు సంఘాల నేతలు స్థల కేటాయింపుకు విశేష కృషి చేసిన తోట చంద్రశేఖర్ ను మర్యాదపూర్వకంగా కలసి అభినందనలు తెలిపారు.

ఈ సంధర్భంగా తోట మాట్లాడుతూ ఇరు తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక జనాభా ఉన్న కాపు,తెలగ,బలిజ,ఒంటరి, తూర్పు కాపులు అన్నీ రంగాల్లో వెనకబాటుకు గురయ్యారని ఆందోళన వ్యక్తం చేశారు. టిడిపి,కాంగ్రెస్,వైసీపీ పార్టీలు ఎన్నికల సమయంలో కాపులను ఓటు బ్యాంకుగా వాడుకొంటూ వారి సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించాయని ఆవేదన వ్యక్తం చేశారు. కాపుల సమస్యలను అర్ధం చేసుకున్న బిఆర్ఎస్ అధినేత కెసిఆర్ వారి సంక్షేమానికి ఎంతగానో కృషి చేస్తున్నారని స్పష్టం చేశారు.

హైదారాబాద్ నడిబొడ్డున హైటెక్ సిటీ సమీపంలో సౌత్ ఇండియా సెంటర్ ఫర్ కాపు కమ్యూనిటీ భవన నిర్మాణానికి ఎంతో విలువైన 6 .87ఎకరాల భూమిని కేటాయించినందుకు తెలంగాణ సిఎం కె సి ఆర్ కు కాపులు ధన్యవాదాలు తెలుపుతూ బిఆర్ఎస్ కు తమ సంపూర్ణ మద్దతు తెలుపు తున్నారన్నారు. తొలుత కాపు సంఘాల నేతలు తోట చంద్రశేఖర్ ను దుస్సాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో కాపు సంఘాల సంక్షేమ సేవా సమితి ఉపాధ్యక్షులు దాసరి రంగారావు,కూకట్ పల్లి కాపు సంఘం అధ్యక్షులు భరత్ ,కూకట్ పల్లి కాపు సంఘం ప్రముఖులు బసల శ్రీనివాస్,కె ఎస్ ఎన్ మూర్తి ,హెచ్ ఎన్ మూర్తి పలు కాపు సంఘాల నాయకులు పెద్దఎత్తున పాల్గొన్నారు.

Also Read: Cow And Snake: ఆవుతో పాము సయ్యాట.. నెట్టింట్లో చక్కర్లు కొడుతున్న వీడియో